Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి అన్ని శుభాలే

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి అన్ని శుభాలే

by Anji
Ad

రాశి ఫలాలు చదవడం వ‌ల్ల‌ ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ముందే తెలుసుకోవొచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Weekly Horoscope in Telugu 19.06.2022 నుండి 18.06.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఉద్యోగ‌లో కీర్తి పెరుగుతుంది. మీ ఆశ‌యం నెర‌వేరుతుంది. వ్యాపార బ‌లం అద్భుతంగా ఉంటుంది. అభిష్టాలు సిద్ధిస్తాయి. భూ గృహ ప్ర‌య‌త్నాల‌లో పురోభివృద్ధి సూచితం. ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్న ప‌ని ఒక‌టి వెంట‌నే అవుతుంది. అవ‌రోధాలు తొల‌గిపోతాయి. స్నేహితుల వ‌ల్ల శాంతి ల‌భిస్తుంది.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

 

శుభ ఫ‌లిత‌ముంటుంది. గ‌త వైభ‌వం ల‌భిస్తుంది. ఉద్యోగంలో తెలియ‌ని అవ‌రోధం ఒక‌టి ఎదుర‌వుతుంది. వివాదాల‌కు అవ‌కాశ‌ముంది. స‌మ‌యానుకూలంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. ఇంట్లో శుభం జ‌రుగుతుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

కాలం వ్య‌తిరేకంగా ఉంటుంది. సంక్లిష్ట స్తితి ఎదుర‌వుతుంది. ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణముంటుంది. ప్ర‌తి అడుగూ నిదానంగా వేయండి. ధ‌ర్మ‌మార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్య‌క్తుల స‌ల‌హాలు పాటించండి. ముఖ్య‌మైన పెద్ద కార్య‌క్రమాల‌ను కొంత‌కాలం వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెంచాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

బుద్ధిబ‌లంతో సుస్థిర‌మైన భ‌విష్య‌త్ ను సొంతం చేసుకుంటారు. వ్యాపార లాభాలు విశేషంగా ఉన్నాయి. దైవానుగ్ర‌హంతో ల‌క్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో స్వ‌ల్ప ఆటంకాలుంటాయి. సామ‌ర‌స్య ధోర‌ణి మేలు. ఆవేశ‌పూరిత‌మైన వాతావ‌ర‌ణానికి దూరంగా ఉండాలి. ఆర్థిక స‌మ‌స్య‌లు రానీయ‌కూడ‌దు. వారాంతంలో శుభం జ‌రుగుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగ ఫ‌లితం శుభ‌ప్ర‌దం. అధికారుల ప్ర‌శంస‌లు పొందుతారు. అభివృద్ధి సాధిస్తారు. అభిమానించే వారు ఉన్నారు. వ్యాపారంలో త‌గిన లాభం ఉంటుంది. న్యాయబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించండి. ఒక‌చిక్కుముడి మిమ్మ‌ల్ని వీడుతుంది. బంధు మిత్రుల‌తో ఆనందిస్తారు. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

 

ఉద్యోగంలో ప‌ద‌వీ లాభం ఉంటుంది. పెద్ద‌ల నుంచి ప్ర‌శంస‌లు ఉంటాయి. ప్ర‌తి నిర్ణ‌యం విజ‌యాన్ని అందిస్తుంది. భూ, వాహ‌న శుభ యోగాలున్నాయి. సుఖ‌, సంతోషాల‌తో కాలం గ‌డుస్తుంది. వారం మ‌ధ్య‌లో ఒక ముఖ్య‌మైన ప‌ని పూర్తి చేస్తారు. వ్యాపారంలో విఘ్నం ఎదుర‌వ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

 

ముఖ్య కార్యాల్లో శ్ర‌ద్ధ పెంచాలి. కాలం మిశ్ర‌మంగా ఉంటుంది. ప్ర‌తి అడుగు ఆలోచించి వేయాలి. ఉద్యోగంలో బాగుంటుంది. పెద్ద‌ల ఆశీస్సుల‌తో ఆప‌ద నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. వ్యాపారం మిశ్ర‌మం, శ్ర‌ద్ధ పెంచాలి. చంచ‌ల‌త్వం వ‌ల్ల గంద‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. కుటుంబ స‌భ్యుల సూచ‌న‌లు పాటించండి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ముఖ్య‌కార్యాల్లో విజ‌యం ల‌భిస్తుంది. ఉద్యోగంలో తెలియ‌ని ఆటంకం ఎదుర‌వుతుంది. ఒత్తిడి శ్ర‌మ పెరుగుతాయి. దేనికి తొంద‌ర‌ప‌డ‌వ‌ద్దు. ధ‌ర్మ‌మార్గంలో ముందుకు సాగండి. వ్యాపారంలో అప్ర‌మ‌త్త‌త చాలా అవ‌స‌రం. గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంటుంది. కుటుంబ ప‌రంగా మంచి జ‌రుగుతుంది. స‌మిష్టి నిర్ణ‌యాలు క‌లిసివ‌స్తాయి.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

శ్ర‌ద్ధ‌గా ప‌ని ప్రారంభించండి. వ్యాపార బ‌లం పెరుగుతుంది. శుభం జ‌రుగుతుంది. విశేష ధ‌న లాభం క‌లుగుతుంది. క్ర‌మంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. శ్ర‌మ‌కు త‌గ్గ గుర్తింపు ల‌భిస్తుంది. కుటుంబ స‌భ్యుల‌కు మేలు జ‌రుగుతుంది. మిత్రుల ద్వారా లాభ‌ప‌డుతారు.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

 

ఉద్యోగంలో కోరుకున్న‌ది జ‌రుగుతుంది. దృఢ సంక‌ల్పంతో ప‌ని చేయండి. ధైర్యం, ధ‌ర్మం రెండు స‌మ‌పాల్లో ఉండాలి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప‌ని పూర్త‌వుతుంది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదురైనా పెట్టుబ‌డులు లాభాన్ని ఇస్తాయి. రుణ‌స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

 

స‌రైన నిర్ణ‌యాల‌తో ముందుకు వెళ్లండి. మీకు మేలు జ‌రుగుతుంది. ఆశ‌య సాధ‌న‌లో ఒక మెట్టుపైకి ఎక్కుతారు. వ్యాపారం క‌లిసి వ‌స్తుంది. ఓ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది. నూతన ప్ర‌య‌త్నాలు విజ‌యం సాధిస్తాయి. భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోండి. కుటుంబ ప‌రంగా మేలు జ‌రుగుతుంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

 

ముఖ్య‌మైన ప‌నుల్లో శ్ర‌ద్ధ పెట్టాలి. అడుగ‌డుగునా విఘ్నాలు ఉన్నాయి. ఉద్యోగ‌ప‌రంగా శ్ర‌మ పెరుగుతుంది. స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాలి. కాలం స‌హ‌క‌రించ‌డం లేదు. జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యాలు తీసుకుని మౌనంగా ప‌ని చేసుకుంట స‌రైన స‌మ‌యం కోసం వేచి చూడాలి. ఇంట్లో వారి సూచ‌న‌ల‌తో మేలు జ‌రుగుతుంది.

Visitors Are Also Reading