Telugu News » Blog » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు వారాంతంలో ఓ శుభవార్త వింటారు

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు వారాంతంలో ఓ శుభవార్త వింటారు

by Anji
Ads

Weekly Rasi Phalau in Telugu 2022: రాశి ఫ‌లాలు 2022  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో  తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫలితాలు  ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Weekly Horoscope in Telugu 18.12.2022 నుంచి 24.12.2022 వరకు

మేషం :

Mesha

Mesha

అవసరాలకు డబ్బు లభిస్తుంది. కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. మనోబలం మనకు అవసరం. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. ప్రణాళికతో పని చేయాలి. గత అనుభవం కాపాడుతుంది. స్వయం కృషితోనే పైకి వస్తారు. బంధు, మిత్రుల అండ మీకు లభిస్తుంది. 

Weekly Horoscope in Telugu 2022: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడిని అయినా జయిస్తారు. సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి. శుభాలు జరుగుతాయి. మంచితనం కాపాడుతుంది. పది మందికి ఆదర్శంగా ఉంటారు. మీరు కోరుకున్నది లభిస్తుంది. మెల్ల మెల్లగా పైకి వస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు. కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు రక్షిస్తాయి. ఉద్యోగంలో ఆలోచించి అడుగు వేయండి. ఆపదలు పొంచి ఉంటాయి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. శాంతంగా సంభాషించాలి. తోటివారి సహకారం అందుతుంది. వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

కాలం అనుకూలిస్తుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయకండి. నూతన విషయాలు తెలుసుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగుంటాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆపదను ముందస్తుగా పసిగట్టగలిగితేనే పనులను పూర్తి చేయగలరు. ఇంట్లో వారితోచర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

మనోబలం విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. అవసరాలకు డబ్బు అదుతుంది. ద్వేషించిన వారే ప్రేమిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆపదలు పొంచి ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో బయట పడుతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. సంతోషించే వార్త వింటారు.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. శాంతంగా పని చేసి ప్రశంసలు పొందాలి. ఉద్యోగంలో అవరోధాలు తొలుగుతాయి. చిత్త శుద్ధితో పని చేసి గుర్తింపు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. మౌనంగా మీ పని మీరు చేయండి. కొన్ని విషయాలలో స్పష్టత చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. అధికార లాభం సూచిస్తుంది. రోజు రోజుకు సంపద పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి. మిత్రుల వల్ల లాభం ఉంటుంది.

Advertisement

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. శ్రమ పెరిగినా అభివృద్ధి ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా సమాధానం ఇవ్వాలి. ప్రతిభతో మెప్పిస్తారు. వారం మధ్యలో ఆనందించే అంశం ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. 

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ప్రతీ అడుగు ఆలోచించి వేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. అపార్థాలకు తావు ఇవ్వకూడదు. మొహమాటం పక్కన పెట్టి ధర్మబద్ధంగా పని చేయాలి. నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. నమ్మిన మార్గంలో ముందుకు సాగండి. నిర్ణయాలను మార్చకూడదు. సమిష్టిగా కృషి చేస్తే సాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. రోజు రోజుకు గౌరవం పెరుగుతుంది. మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది. పలు మార్గాలలో లాభపడుతారు. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. ఆశయం నెరవేరే వరకు పని ఆపకూడదు. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగ ఫలితం ఉంటుంది. రావాల్సినవి తిరిగి వస్తాయి. కీర్తి పెరుగుతుంది. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వాారా సంతృప్తి లభిస్తుంది. ఆవేశం అస్సలు పనికిరాదు. సొంత నిర్ణయం మంచిది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి. కుటుంబపరంగా సంతోషిసంచే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

You may also like