Telugu News » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి

by Anji

రాశి ఫ‌లాలను చ‌ద‌వ‌డం ద్వారా జీవితంలో వారం ముందే ఏమి జ‌రుగుతుందో తెలుసుకోవ‌చ్చు. ఈ వారంలో ఏయే రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

Weekly Horoscope in Telugu 15 may 2002 to 21 may 2022 :

మేషం

 

వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌తో ధైర్యంగా ముందుకు న‌డుస్తారు. ఉద్యోగంలో కార్య‌సిద్ధి ఉంటుంది. ఆత్మ‌విశ్వాసాన్ని త‌గ్గించే వారు ఉంటారు. మితంగా మాట్లాడాలి. స్వ‌విష‌యాలు ఎవ‌రితోనూ చ‌ర్చించ‌వ‌ద్దు. అవ‌స‌రాల‌కు ధ‌నం అందుతుంది. వారం మ‌ధ్య‌లో విజ‌యం చేకూరుతుంది.

వృషభం

మ‌నోబ‌లం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కోరిక‌లు నెర‌వేరుతాయి. దృడ‌చిత్తంగా ధ‌ర్మ‌మార్గంలో చేసే ప‌నులు విజ‌య‌వంతం అవుతాయి. స్తిరాస్తి వృద్ధి చెందుతుంది. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా పూర్తి చేస్తారు. గ‌తంలో కానీ ప‌నులు ఇప్పుడు పూర్త‌వుతాయి. వ్యాపారంలో జాగ్ర‌త్త‌.

 మిథునం

ముఖ్య‌కార్యాల్లో శ్ర‌ద్ధ పెంచాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సౌమ్యంగా మాట్లాడాలి. అడుగ‌డుగునా ఆటంకాలు ఉన్నాయి. తెలివిగా అధిగ‌మించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా త‌గిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయండి. వ్యాపారంలో కొత్త ప్ర‌యోగాలు చేయ‌వ‌ద్దు. ఏ నిర్ణ‌య‌మైనా కుటుంబ స‌భ్యుల సల‌హాతో తీసుకుంటే మేలు చేస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

శుభ‌కాలం న‌డుస్తోంది. అన్ని విధాలుగా క‌లిసి వ‌స్తుంది. మంచి నిర్ణ‌యాలు తీసుకుని అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ ప‌రంగా అభివృద్ధి ప్ర‌శంస‌లు ఉంటాయి. ఎదురుచూస్తున్న ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది. దివ్య‌మైన ఆలోచ‌న‌లు వ‌స్తాయి. స‌మాజంలో మంచి పేరు ల‌భిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. బంగారు భ‌విష్య‌త్‌ను సాధిస్తారు.

సింహం

ఉద్యోగంలో ప్రశంశలు ఉంటాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఏకాగ్రత చాలా అవసరం. ఎవరిని నమ్మవద్దు. స్వయంగా చేసే పనులు శక్తినిస్తాయి. ధనలాభం ఉంటుంది. కాలం వృధా చేయకుండా పని చేస్తే విజయం లభిస్తుంది. సాహస కార్యాలు అసలు చేయవద్దు.

 కన్య

గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. మీరు అనుకున్న విధంగానే ముందుకు సాగండి. అవరోధాలను సునాయాసంగా దాటగలరు. సంకల్పం బలంగా ఉండాలి. చెడు ఆలోచనలు రానివ్వదు. ఈర్ష్య వారు ఉంటారు జాగ్రత్త.

 తుల

 

మనోబలం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యాలను వాయిదా వేయడం మంచిది. కాలం సహకరించడం లేదు. పొరపాటు జరిగితే సమస్య జటిలమవుతుంది. ఆత్మవిశ్వాసంతో విధులను నిర్వర్తించాలి. శాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విఘ్నాలు అధికం అవుతాయి.

 వృశ్చికం 

కార్య‌సిద్ధి విశేషంగా ఉంటుంది. ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్ట‌వంతుల‌వుతారు. కీర్తి ప్ర‌తిష్ట‌లు ఉంటాయి. ఆర్థిక ప‌రిపుష్టి ల‌భిస్తుంది. శ్ర‌ద్ధ పెంచితే అధిక లాభాలుంటాయి. ఇంట్లో వారి స‌ల‌హాలు అమ‌లు చేయండి. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభ‌వార్త వింటారు.

 ధనస్సు

అత్యంత శ్రేష్ట‌మైన కాలం. తిరుగులేని ఫ‌లితాలు మ‌న‌కీర్తిని పొందుతారు. ఉద్యోగ ఫ‌లితాలు ఆత్మ‌స్థైర్యాన్ని పెంచుతాయి. కాలానుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోండి. ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. బంగారు జీవితం ల‌భిస్తుంది. వ్యాపార‌బ‌లం ఉంది. ఆర్థికంగా క‌ల‌సి వ‌స్తుంది. సంప‌ద పెరుగుతుంది.

 మ‌క‌రం

ఉద్యోగ ఫ‌లితాలు మిశ్ర‌మం. దేనికి వెనుకాడ‌కుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. ధ‌న‌, ధాన్య లాభం ఉంటుంది. ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. వ్యాపారంలో స‌మ‌స్య రానివ్వ‌ద్దు. బందువుల వ‌ల్ల మంచి జ‌రుగుతుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

 కుంభం

మంచి కాలం న‌డుస్తోంది. అద్భుత‌మైన తెలివితేట‌ల‌తో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తారు. ఆశ‌యం నెర‌వేరుతుంది. ఉద్యోగంలో కీర్తి ల‌భిస్తుంది. పెద్ద‌ల అనుగ్ర‌హం సిద్ధిస్తుంది. ఆర్థికంగా విశేష లాభాలు ఉంటాయి. సంక‌ల్పం నెర‌వేరుతుంది. ఎదురుచూస్తున్న ప‌ని ఒక‌టి పూర్తి అవుతుంది. ఆనందించే అంశం ఉంటుంది.

మీనం

ఉద్యోగ ఫ‌లితం అద్భుతం. ధ‌ర్మ‌మార్గంలో విజ‌యం సాధిస్తారు. అవ‌రోధాలు తొల‌గుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారరిత్యా ప‌ట్టు విడుపుల‌తో ప‌ని చేయండి. స్వ‌ల్ప స‌మ‌స్య‌లు ఉన్నా అంతిమంగా క‌లిసి వ‌స్తుంది. మంచి భ‌విష్య‌త్ ఏర్ప‌డుతుంది. కుటుంబ స‌భ్యుల‌ను సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకోండి.


You may also like