Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు..!

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు..!

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 13.11.2022 నుండి 19.11.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఉద్యోగ రంగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. మంచి గుర్తింపును పొందుతారు. స్నేహితుల ద్వారా లాభం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

ఉద్యోగంలో ఉద్యోగంలో క్రమ క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో లాభం కలుగుతుంది. నూతన ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. అంతా మన మంచికే అన్న ధోరణి మేలు. కాలం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. పరీక్షకాలంగా అనిపిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ చూపాలి. సౌమ్యంగా సంభాషించాలి. కొన్ని పనులను వాయిదా వేయగలిగితే ఒత్తిడిని జయిస్తారు. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

వ్యాపార బలం అద్భుతం. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఉంటాయి. అధిక ధనలాభం సూచితం. భూ, గృహ యోగాలు అనుకూలిస్తాయి. ప్రయత్న బలాన్ని బట్టి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. జీవితాశయం నెరవేరుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

అత్యంత శుభకాలం నడుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. అభివృద్ధిపై దృష్టి సారించండి. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. క్రమ క్రమంగా సుస్థిరత లభిస్తుంది. ఎదురుచూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. సకాలంలో మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చుతుంది. కాలం మీకు సహకరిస్తుంది. వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఒత్తిడి పనికి రాదు. పనులను వాయిదా వేయకూడదు. శత్రువులు మీకు మిత్రులు అవుతారు. మీరు ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

పనులు సకాలంలో పూర్తి అయ్యేవిధంగా చూసుకోవాలి. కాలం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. నిందలు మోసేవారుంటారు. ధైర్యంగా సమాధానం ఇవ్వాలి. చేయని పనికి బాధ్యత వహించాల్సి రావచ్చు. సంయమనం చాలా అవసరం.  వారం మధ్యలో స్పష్టత వస్తుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. లక్ష్యాన్ని చేరుతారు. ఈ వారం సంతృప్తిని ఇస్తుంది. మాటలో స్పష్టత, సౌమ్యత చాలా అవసరం.  ఒక పని చేతిదాకా వస్తుంది. ధర్మ మార్గంలో ప్రయత్నించాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగ, వ్యాపార రంగాలు చాలా బాగున్నాయి. వారం మధ్యలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. నలుగురినీ కలుపుకొని వెళ్లాలి. సాంకేతిక లోపాలు రానివ్వకూడదు. ఎదురుచూస్తున్న పని దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ప్రతి విషయాన్నీ అందరికీ చెప్పుకోవచ్చు.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

శుభకాలం కలిసి వస్తుంది. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. అనేక విధాలుగా పైకి రావడానికి కాలం అనుకూలిస్తుంది. మిత్రుల వల్ల లాభం చేకూరుతుంది. వ్యాపారంలో బాగా కష్టపడాలి. ప్రయాణాల్లో లాభం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార పరంగా శ్రమ పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవసరాలకు ధనం లభిస్తుంది. ఒత్తిడి కలిగించే సందర్భాలు ఉంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా నష్టాలు చేకూరుతాయి.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

నమ్మకంతో పనిని ప్రారంభించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యం అస్సలు పనికిరాదు. ఉద్యోగ, వ్యాపార రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కొందరి వల్ల మీకు ఇబ్బందులు పడవచ్చు. పట్టుదలతో చేసే పనులు స్థిరమైన భవిష్యత్ ని ఇస్తాయి. మొహమాటంతో లేని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి.

Visitors Are Also Reading