Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 11.06.2023 నుంచి 17.06.2023 వరకు మేషం :

Mesha

Mesha

వ్యాపారం చాలా బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో కాస్త శ్రమ పెరుగుతుంది. ఏకాగ్రతతో పని చేస్తే మీ యొక్క లక్ష్యాన్ని తప్పకుండా చేరుతారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా కలిసొస్తుంది. మానసికంగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగ ఫలితాలుంటాయి. ప్రశాంతంగా పనులను ప్రారంభించి ఉత్సాహంగా ముందుకు సాగండి. ఏది లోతుగా ఆలోచించకూడదు. గతాన్ని గుర్తుకు చేసుకొని ఇబ్బంది అస్సలు పడకూడదు. మీ నిర్ణయాల్లో మీకే స్పష్టత వస్తుంది. ప్రారంభింనటువంటి పని పూర్తయ్యే వరకు ఆపకూడదు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేయాలి. కీలక నిర్ణయాల్లో ఓ స్పష్టత వస్తుంది. ఆత్మవిశ్వాసం అస్సలు తగ్గకూడదు. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరించాలి. వ్యాపారంలో ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ప్రతీ పని కుటుంబ సభ్యులకు చెప్పి చేయాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

Advertisement

విశేషమైన అభివృద్ధి సాధిస్తారు. బుద్ధిబలంతో అధికారులను మెప్పిస్తారు. వ్యాపారం చాలా బాగుంటుంది. ఏ పనిని ప్రారంభించినా తప్పకుండా లాభముంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విమర్శలను మనస్సుకి తీసుకోవద్దు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

తలచిన కార్యాలు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. సమయాన్ని మాత్రం అస్సలు వృథా చేసుకోకూడదు. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం వరిస్తుంది. ఉద్యోగంలో కాస్త మేలు జరిగే అవకాశముంది. మీ యొక్క ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ఉత్తమం. కొన్ని విషయాల్లో ఓ స్పష్టత ఉండదు. ఆత్మీయులతో చర్చలు జరిపి పని చేయడం బెటర్. వ్యాపారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

సంకల్పబలంతో పనిని ప్రారంభిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. కీలకమైన కార్యాల్లో ఏకాగ్రతను పెంచాలి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. బాధ్యతాయుతంగా నడుచుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మంచి భవిష్యత్ కోసం వేచి చూడాలి. రుణ సమస్యలు రానివ్వకూడదు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

కాలం చాలా మిశ్రమంగా ఉంటుంది. పనులను సకాలంలో ప్రారంభించి ఏకాగ్రతతో పూర్తి చేయాలి. ఆర్థికంగా కలిసొస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వ్యాపారంలో కాస్త ఇబ్బందులుంటాయి. ముందస్తు ప్రణాళికతో నష్టనివారణ సాధ్యమవుతుంది. ధర్మ మార్గంలో చేసే పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవు. ఓర్పు తో ముందుకు వెళ్లడం ఉత్తమం.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

మీరు ఏ పనిని ప్రారంభించినా తేలికగా విజయం వరిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టపోయే అవకాశముంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ముఖ్యమైన కార్యక్రమాలు కొంత కాలం వాయిదా వేయడం చాలా మంచిది. ఏకాగ్రతతో పనులను విజయవంతంగా పూర్తి చేయాలి. తోటివారి సహకారం మీకు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా బెటర్. ఓ ఆపద నుంచి మీరు బయటపడుతారు.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

వ్యాపారం అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులను మధ్యలోనే ఆపకూడదు. సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వ్యాపారం మీకు కలిసి వస్తుంది. ఖర్చులను నియంత్రించుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్సాహవంతంగా నిర్ణయాలు తీసుకోండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులను మధ్యలోనే ఆపకూడదు. సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలి.

Visitors Are Also Reading