Telugu News » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు డైలీ చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 10.07.2022 నుండి 16.07.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఆశించిన స్థాయిలో అన్ని విదాలుగా పురోగ‌తి ఉంటుంది. ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డ‌మే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజ‌కీయాల్లో ప్ర‌వేశించే అవ‌కాశ‌ముంది. ప‌లుకుబ‌డి పెరుగుతుంది. ఉద్యోగంలో ప‌ని ఒత్తిడి పెరిగిన‌ప్ప‌టికీ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగ‌స్వాములు స‌హ‌క‌రిస్తారు. శ్ర‌మ‌కు త‌గ్గ‌ట్టుగా లాభాలు గ‌డిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణ‌త సాధిస్తారు. వృత్తి నిపుణుల‌కు అనుకూల స‌మ‌యం. డాక్ట‌ర్ల‌కు ప‌ని ఒత్తిడి ఉంటుంది. టెక్నాల‌జీ రంగంలో ఉన్న‌వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగుల‌తో విభేదాల‌కు అవ‌కాశ‌ముంది. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగువేయ‌డం బెట‌ర్.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

అదృష్ట‌యోగం ప‌ట్ట‌బోతుంది. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. ఉద్యోగ‌, వివాహ ప్ర‌య‌త్నాల‌కు స‌మ‌యం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ‌వార్త‌లు వింటారు. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. సామాజిక కార్య‌క‌లాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్న‌నాటి స్నేహితుల‌ను క‌లుసుకుంటారు. విద్యార్థులు శ్ర‌మ మీద పురోగ‌తి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్ర‌త్త. వృత్తి నిపుణుల‌కు రియ‌ల్ ఎస్టేవారికి క‌లిసొస్తుంది. ఎవ్వ‌రితో వాదోప‌వాదాల‌కు దిగ‌వ‌ద్దు. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు వేస్తారు. సంతానం క‌లిగే సూచ‌న‌లు క‌నిపిస్తాయి. డ‌బ్బు న‌ష్ట‌పోతారు జాగ్ర‌త్త‌.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

గురు బ‌లం బాగా ఉన్నందువ‌ల్ల ఈ వారం ఆదాయ‌ప‌రంగా, ఆరోగ్య‌ప‌రంగా అనుకూలంగా ఉంది. పెండింగ్ ప‌నులు పూర్త‌వుతాయి. ఆస్తి కొనే అవ‌కాశ‌ముంది. గ‌తంలో డ‌బ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. సంతానంలో ఒక‌రికి దూర ప్రాంతంలో ఉద్యోగం ల‌భిస్తుంది. విద్యార్థులు సునాయ‌సంగా పురోగ‌తి సాధిస్తారు. ప్రేమ‌లో ఉన్న‌వారు ముంద‌డుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. స్వ‌యం ఉపాధి వారికి, చిన్న వ్యాపారుల‌కు అభివృద్ధికి అవ‌కాశం ఉంది. కుటుంబ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డుతారు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండ‌దు. తిప్ప‌ట ఎక్కువ‌గా ఉన్నా త‌ల‌చిన ప‌నులు పూర్త‌వుతాయి. శ్ర‌మ అధికం, ఫ‌లితం స్వ‌ల్పం అన్న‌ట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్న‌పాటి ఉద్యోగం ల‌భించ‌వ‌చ్చు. చిన్న‌నాటి స్నేహితుల‌తో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తారు. స‌హోద్యోగుల‌కు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్ర‌మ‌ప‌డాల్సి వ‌స్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఆర్థిక సంబంధ‌మైన రంగాల్లో ఉన్న వారికి స‌మ‌యం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌గా ముందుకు వెళ్ల‌డం మంచిది. ఎవ్వ‌రికీ హామీలు ఉండ‌వ‌ద్దు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వీరు ఓ శుభ‌వార్త వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫ‌ర్లు వ‌స్తాయి. ఆరోగ్యం చాలా వ‌ర‌కు కుదుట ప‌డుతుంది. స‌ప్త‌మ శ‌ని కార‌ణంగా కొన్ని ప‌నులు బాగా ఆల‌స్యం అవుతుంటాయి. ఆదాయం మెరుగు ప‌డుతుంది. స్నేహితుల‌తో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. మీ పిల్ల‌ల్లో ఒక‌రికి మంచి కంపెనీలో ఉద్యోగం ల‌భించే అవ‌కాశం ఉంది. కామ‌ర్స్‌, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణుల‌కు స‌మ‌యం బాగుంటుంది. ఇల్లు మారే అవ‌కాశ‌ముంది. ప్రేమ వ్య‌వ‌హారాలు అసంతృప్తినిస్తాయి. ముఖ్యంగా ఎవ్వ‌రికీ డ‌బ్బుకుండా జాగ్ర‌త్త ప‌డండి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

 

ఉద్యోగ వివాహ ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వ‌స్తాయి. ఉన్న‌త విద్య‌కోసం సంతానంలో ఒక‌రు దూర ప్రాంతాల‌కు వెళ్లే అవ‌కాశ‌ముంది. మ‌ధ్య, మ‌ధ్య అనారోగ్యాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. శుభ‌కార్యాల్లో పాల్గొనే అవ‌కాశ‌ముంది. బంధు మిత్రుల నుంచి మంచి స‌హాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాప‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు వేస్తారు. వృత్తి నిపుణుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ వారికి స‌మ‌యం బాగుంది.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ప‌డ‌తారు. ఖ‌ర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వ‌స్తుంది. స్నేహితులు, బంధువులు స‌హాయం అంద‌జేస్తారు. సంతానం నుంచి శుభ‌వార్త‌లు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశ‌ముంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం ల‌భించ‌వచ్చు. చెడు స్నేహాల‌కు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్ర‌మ మీద రాణిస్తారు. రియ‌ల్ ఎస్టేట్, రాజ‌కీయాలు, సామాజిక సేవా రంగాల వారికి స‌మ‌యం అనుకూలం. ఆక‌స్మిక ప్ర‌యాణాల‌కు అవ‌కాశ‌ముంది. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబ స‌మ‌స్య ఒక‌టి సానుకూలంగా ప‌రిష్కార‌మ‌వుతుంది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ ఉహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల‌కు అవ‌కాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు. పెండింగ్ ప‌నుల్లో చాలా వ‌ర‌కు పూర్త‌వుతాయి. పెళ్లి ప్ర‌య‌త్నాలు చురుకుగా సాగుతాయి. స్థాన చ‌ల‌నానికి అవ‌కాశం ఉంది. తోబుట్టువుల‌తో విభేదాలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. సంతాన యోగానికి అవ‌కాశం ఉంది. స్నేహితుల‌కు హామీ ఉండి దెబ్బ‌తింటారు. విద్యార్థులు పురోగ‌తి చెందుతారు. ప్రేమ వ్య‌వ‌హారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార‌, ఆతిథ్య రంగాల వారికి అనుకూల స‌మ‌యం. ప్ర‌యాణాల వ‌ల్ల ఆర్థికంగా న‌ష్ట‌పోతారు. ఎవ్వ‌రితోనూ వాద‌న‌లు దిగ‌వ‌ద్దు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల ను౦చి ఆఫర్‌ అందవచ్చు. ఆదాయంలో ఎదుగూ బొదుగూ ఉండదు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

గ్ర‌హ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆశించిన ప‌నుల‌న్ని శ్ర‌మ మీద పూర్తి అవుతాయి. గ‌తంలో మీ నుంచి సాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తారుగా ఉంది. విద్యార్థుల‌కు ప‌ర‌వాలేదు. డాక్ట‌ర్లు, టెక్నాల‌జి నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారు పురోగ‌తి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ప్రేమ వ్య‌వ‌హారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక లావాదేవీల‌కు దూరంగా ఉండండి. ఎవ్వ‌రికీ గుడ్డిగా న‌మ్మ‌వ‌ద్దు. నిరుద్యోగుల‌కు, ఉద్యోగానికి సంబంధించి ఆఫ‌ర్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఎవ్వ‌రికీ హామీలు ఉండ‌క‌పోవ‌డం మంచిది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఈ వారం చాలా వ‌ర‌కు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణ‌యాల‌తో ముందుకు వెళ‌తారు. శుభ కార్యాల గురించి ఆలోచిస్తారు. స‌మాజంలో ప‌లుకుబ‌డి క‌లిగిన వారితో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగు ఉండ‌దు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నా ఫ‌లిత‌ముంటుంది. స్థాన చ‌ల‌నానికి అవ‌కాశముంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఓ శుభ‌వార్త వింటారు. విద్యార్థులు విజ‌యాల‌ను సాధిస్తారు. ప్రేమ వ్య‌వ‌హారాల్లో మ‌రొక అడుగు ముందుకు వేస్తారు. ఇంజినీర్ల‌కు, ఐటీ నిపుణుల‌కు, న్యాయ‌వాదుల‌కు బాగుంటుంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫ‌ర్లు మీ ముందుకు వ‌స్తాయి. శుభ‌వార్త‌లు వింటారు. గ్ర‌హ సంచారం స‌రిగ్గా లేని కార‌ణంగా ప్ర‌తి ప‌ని ఆల‌స్యం అవుతుంది. త‌ల‌చిన ప‌నులు పూర్త‌వుతాయి. కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటారు. సైన్స్‌, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు వేస్తారు. రాజ‌కీయ‌, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

Visitors Are Also Reading