రాశి ఫలాలు డైలీ చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Weekly Horoscope in Telugu 07.08.2022 నుండి 13.08.2022 వరకు
మేషం :
Mesha
ఏకాగ్రతతో పని చేయండి. తొందరవద్దు. మొహమాట ఇబ్బంది పెడుతుంది. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి లోనవ్వకుండా బాధ్యతలను నిర్వర్తించండి. ఆర్థిక వృద్ధి సూచితం. నూతన ప్రయత్నాలకు ఇది సమయం కాదు.. అపార్థాలకు తావు ఇవ్వవద్దు.
Weekly Horoscope in Telugu: వృషభం
Vrushabha
శుభకాలం నడుస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. శత్రువులు మిత్రులు అవుతారు. గత వైభవం సిద్ధిస్తుంది. అధికారుల ప్రశంసలుంటాయి. యోగ్యతలను పెంచుకుంటూ ఉన్నత స్థితికి చేరండి. వ్యాపార లాభం ఉంది. కల సాకారమవుతుంది. సుఖ, యోగ్యతలను పెంచుకుంటూ ఉన్నత స్థితికి చేరండి. వ్యాపార లాభం ఉంది. కల సాకారమవుతుంది. సుఖ, సంతోషాలు లభిస్తాయి.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
ఉద్యోగ వ్యాపారాల్లో మనోబలంతో ముందుకు వెళ్లాలి. పట్టుదల, మితభాషణం, సమయమూర్తి అవసరం. అపార్థాలకు తావివ్వవద్దు. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త. పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ఆలోచనలు శక్తినిస్తాయి. ప్రయాణాల్లో లాభం ఉంటుంది.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. పలు మార్గాల్లో ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్ పై దృష్టి నిలపండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంట్లో వారి సూచనలు అవసరం. కలిసి కట్టుగా పని చేయాలి. వారాంతంలో అభిష్టసిద్ధి ఉంది.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యకార్యాలను ఏకాగ్రతతతో పూర్తి చేయాలి. విఘ్నం ఇబ్బంది పెడుతుంది. పనులను వాయిదా వేయవద్దు. పొరపాట్లు జరుగనివ్వవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Weekly Horoscope in Telugu : కన్య
Kanya
ఉద్యోగబలం ఉంది. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆపదలు తొలగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. విమర్శించిన వారే ప్రశంసించారు. వ్యాపారంలో సమస్య ఉంది. ఏది లోతుగా తర్కించవద్దు. మితభాషణం మేలు చేస్తుంది. విశ్రాంతి అవసరం.
Weekly Horoscope in Telugu : తుల
Thula
ఉద్యోగంలో కోరుకుంటున్న ఫలితం వెంటనే లభిస్తుంది. చిత్తశుద్ధితో చేసిన పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. ఎంత కష్టపడితే అంత మంచిది. తెలియని విఘ్నాలు ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా ముందుకు వెళ్లాలి. సన్నిహితులతో విభేదించవద్దు. చంచలత్వం పనికిరాదు.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
శుభకాలం నడుస్తోంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పలు మార్గాల్లో విజయం సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో ప్రతిభ చూపి గుర్తింపు పొందుతారు. ఆశించిన స్థాయికి ఎదుగుతారు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యకార్యాలపై దృష్టి పెట్టి సదా అభివృద్ధినే కాంక్షించండి. వృథా కాలక్షేపం చేయవద్దు.
Weekly Horoscope in Telugu : ధనస్సు
Dhanassu
ఆర్థికంగా బాగుంటుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో తెలియని ఆటంకం ఎదురయ్యే సూచన ఉంది. అపార్థాలకు తావివ్వకండి. మాటల్లో స్పష్టత ముఖ్యం. పనులను వాయిదా వేయవద్దు. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
మనోబలంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ధర్మమార్గంలో ముందుకు వెళ్లండి. ఉద్యోగంలో ఇబ్బంది ఉన్నా బుద్ధిబలంతో గెలుస్తారు. మీ మంచితనమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. సమిష్టి నిర్ణయం మేలు.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
మంచి కాలం నడుస్తుంది. బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో గొప్ప విజయం ఉంది. అవరోధాలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో సహనంతో పని చేయాలి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. ఎదురుచూస్తున్న పనులు సకాలంలో అవుతాయి. కష్టాలు తొలగుతాయి.
Weekly Horoscope in Telugu : మీనం
Meena
వ్యాపార లాభం బాగుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. సుఖ, సంతోషాలున్నాయి. చెడు ఊహించవద్దు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. చంచలత్వం వల్ల తెలియని సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలి. వృథా కాలక్షేపం చేయవద్దు.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి