రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 06.11.2022 నుండి 12.11.2022 వరకు
మేషం :
Mesha
ప్రతి అంశాన్నీ చాలా లోతుగా ఆలోచించాలి. అపార్థాలకు తావివ్వకూడదు. పనిలో స్పష్టత చాలా అవసరం. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ధర్మమార్గంలో వృద్ధి లభిస్తుంది.
Weekly Horoscope in Telugu: వృషభం
Vrushabha
అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో గొప్ప ఫలితాలు ఉంటాయి. గౌరవము పెరుగుతుంది. త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. అధికారుల అండ లభిస్తుంది. తోటి వారి ప్రశంసలు అందుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పలు విధాలుగా లాభాలు చేకూరుతాయి. కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
మంచి మనసుతో పనులు ప్రారంభించండి. ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాతనే ముందుకు వెళ్లాలి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి. వ్యాపారము అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
వారం ప్రారంభంలో అదృష్టం కలుగుతుంది. వ్యాపారము అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటే అద్భుతమైన విజయము లభిస్తుంది. కర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. మొహమాటం లేకుండా సున్నితంగా వ్యవహరించాలి. ఆశయాలకు తగినట్టుగా భవిష్యత్తు ప్రణాళిక వేసుకోండి.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
ఉత్తమ ఫలితాలు ఉంటాయి. సకాలంలో పనిని ప్రారంభించండి. క్రమంగా అభివృద్ధి చెందుతారు. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమస్యలు తొలగిపోతాయి. జీవిత ఆశయము నెరవేరుతుంది. సిరబుద్ధి చాలా అవసరం. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితము ఉంటుంది. దేనికి తీవ్రంగా స్పందించవద్దు.
Weekly Horoscope in Telugu : కన్య
Kanya
ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగుంటాయి. మంచి మనసుతో ప్రశాంతంగా పనిని ప్రారంభించండి. సునాయాసంగా విజయము వరిస్తుంది. ప్రతిభతో పెద్దలను ఆకట్టుకుంటారు. అదృష్టము కలసి వస్తుంది. కొత్తగా ఆలోచిస్తూ అభివృద్ధి వపు ప్రప్రయాణించాలి. ఎప్పుడు మంచినే ఊహించాలి. శుభం కలుగుతుంది.
Advertisement
Weekly Horoscope in Telugu : తుల
Thula
కాలం మిశ్రమంగా ఉంది. అంతా మంచి జరుగుతుంది. తొందరపడకూడదు. సర్దుకుపోయే ధోరణి చాలా అవసరం. ఆలోచనలకు తగ్గట్టు పని చేయాలి. అడుగడుగునా అడ్డుపడేవారు ఉంటారు. స్పష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్లండి. చురుకుగా ఉండాలి. వారం మధ్యలో విజయం వరిస్తుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. ఉత్సాహం చాాలా ముఖ్యం. అధికార లాభం ఉంటుంది. ఘనకీర్తి బంగారు భవిష్యత్ లభిస్తాయి. స్పష్టత వస్తుంది. వ్యాపార వృద్ధి ఉంటుంది. స్వశక్తితో పైకి వస్తారు. రాజయోగం ఉంటుంది.
Advertisement
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అవసరాలకు తగిన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని సకాలంలో అమలు చేయాలి. వ్యాపార బలం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు పలిస్తాయి. విజ్ఞానపరంగా ముందుంటారు. పదిమందికీ ఆదర్శంగా నిలుస్తారు. ధనయోగం ఉంటుంది.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
వారం ప్రారంంలో కార్యసిద్ధి గోచరిస్తోంది. ఉద్యోగ ఫలితం శ్రేష్టం. సద్భావన, స్పష్టమైన ఆలోచనలతో అభిష్టసిద్ధి కలుగుతుంది. మోసం చేసే వారు ఉన్నారు. బుద్ధిబలం చాలా అవసరం. కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రత సడలనివ్వవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దేనికీ బద్ధకించవద్దు.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
ఉద్యోగంలో ఏకాగ్రత చాలా అవసరం. తెలియని విఘ్నాలు ఉంటాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరాలి. శ్రమ వృధా కాదు. అధికారుల ప్రశంసలు అందుతాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో వారితో శాంతంగా వ్యవహరించండి. జీవితం సానుకూలంగా సాగుతుంది.
Weekly Horoscope in Telugu : మీనం
Meena
ఆర్థిక అంశాలు బాగుంటాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సమయస్పూర్తితో పని చేయాలి. ఆవేశ పరిచే వారు ఉంటారు. సున్నితమైన విషయాల్లో లోతుగా చర్చించకూడదు. మిత్రుల అండతో మంచి భవిష్యత్ కోసం ప్రయత్నించాలి. వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం. వారాంతంలో మంచి వార్త వింటారు.