Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు అనుకున్న‌ది సాధిస్తారు

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు అనుకున్న‌ది సాధిస్తారు

by Anji
Ad

రాశి ఫలాలు చదవడం వ‌ల్ల‌ ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ముందే తెలుసుకోవొచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Weekly Horoscope in Telugu 05.06.2022 నుండి 11.06.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ముఖ్య‌కార్యాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేయండి. మ‌నోబ‌లంతో విజ‌యం ల‌భిస్తుంది. ప‌నిలో స్ప‌ష్ట‌త చాలా అవ‌స‌రం. ఏ ప‌ని ముందు, ఏది వెనుక చేయాలో ఆలోచించి చేయాలి. గంద‌ర‌గోళ స్థితి ప‌నికి రాదు. బంధుమిత్రుల ద్వారా కొన్ని పనులు జ‌రుగుతాయి. ఉద్యోగ‌, వ్యాపారాలు బాగుంటాయి. ధ‌న‌యోగం ఉంది.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

అదృష్టఫ‌లాలు అందుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. కాలం స‌హ‌క‌రిస్తోంది. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో ప‌ని చేసి అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ‌, వ్యాపారాలు బాగుంటాయి. అధికార లాభ సూచితం. ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేప‌డుతారు. గౌర‌వం పెరుగుతుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. భూగృహ వాహ‌నాది లాభాలు ఉన్నాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఆశ‌యం నెర‌వేరుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణ‌యాల‌ను తీసుకోవాలి. అప్ర‌మ‌త్త‌గా లేక‌పోతే లాభం క‌న్న న‌ష్టం అధికం అయ్యే సూచ‌న‌లు ఉన్నాయి. ధ‌న‌యోగం ఉంటుంది. కొన్ని విష‌యాల్లో తెలియ‌ని ఆటంకాలు ఉన్నాయి. ద‌గ్గ‌రి వారితో సంప్ర‌దించి నిర్ణ‌యాలు తీసుకోవాలి. వివాదాల‌కు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక‌త దిశ‌గా ఆలోచించండి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

అనేక శుభ యోగాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిని చాలా జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించుకుంటూ అభివృద్ధిని సాధించాలి. స్వ‌ల్ప ప్ర‌య‌త్నంతోనే గొప్ప విజ‌యాలు సాధించే అవ‌కాశం ఉంది. ఉద్యోగ రిత్యా శుభ‌కాలం. నూత‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయి. అభిష్టం సిద్ధిస్తుంది. వ్యాపార బ‌లం పెరుగుతుంది. ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తారు.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

భ‌గ‌వ‌ద‌నుగ్ర‌హంతో మంచి విజ‌యం ల‌భిస్తుంది. ఉద్యోగంలో పురోగ‌తి ఉంటుంది. చెడు ఊహించ‌వ‌ద్దు. ఒత్తిడి లేకుండా ప‌ని చేయండి. సొంత నిర్ణ‌యాలు వ‌ద్దు. స‌మిష్టి కృషి ఫ‌లిస్తుంది. కుటుంబ ప‌రంగా ఒడిదొడుకుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవాలి. ప‌ట్టువిడుపులు అవస‌రం. ఉత్త‌మ ఫ‌లితాల‌కు నిరంత‌ర ప్ర‌య‌త్నం జ‌ర‌గాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

మ‌న‌సు పెట్టి ప‌ని చేయండి. అనుకున్న‌ది సాధిస్తారు. కాలాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. ప‌రిస్థితులు క్ర‌మంగా సానుకూల‌మ‌వుతాయి. తోటివారి నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆవేశ‌ప‌రిచే వారు ఉంటారు. శాంత స్వ‌భావంతో వ్య‌వ‌హ‌రిస్తూ ల‌క్ష్యం దిశ‌గా సాగాలి. ప‌నిలో నైపుణ్యం పెంచుకోవాలి. ముఖ్య కార్యాల్లో బ్ర‌హ్మాండ‌మైన ఫ‌లితాలు సాధిస్తారు.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ధైర్యంగా, ఏకాగ్ర‌తతో ముందుకు సాగాలి. తొంద‌ర‌వ‌ద్దు. తెలియ‌ని విఘ్నాలు ఉంటాయి. ఉద్యోగ బాధ్య‌త‌లో ఆవేశం ప‌నికి రాదు. స‌కాలంలో ప‌నులు పూర్తి చేయండి. గంద‌ర‌గోళ స్థితి క‌లుగ‌కుండా చూసుకోవాలి. ఎదురుచూస్తున్న ప‌నిలో విజ‌యం ఉంటుంది. పేరు ప్ర‌తిష్ట‌ల కోసం ప్ర‌య‌త్నించాలి. కుటుంబ స‌భ్యుల వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఆశ‌యం నెర‌వేరుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. త‌గినంత మాన‌వ‌ప్ర‌య‌త్నం చేయాలి. ప‌రిస్థితిని అర్థం చేసుకుంటూ అవ‌స‌రానికి త‌గిన‌ట్టు ప‌ని చేస్తే మంచి భ‌విష్య‌త్ ల‌భిస్తుంది. ఉద్యోగంలో శ్ర‌మ పెరుగుతుంది. నిరాశ ప‌రిచే వారున్నారు. మ‌నోబ‌లం ముఖ్యం. వివాదాల‌కు దూరంగా ఉండాలి. స్వ‌యం కృషి ముందుకు న‌డిపిస్తుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

అద్భుత‌మైన శుభ‌కాలం న‌డుస్తోంది. ఊహించిన విజ‌యాలు అందుతాయి. గృహ‌వాహ‌నాది శుభ‌యోగాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఉద్యోగంలో మంచి ఫ‌లితం ఉంటుంది. పెద్ద‌ల వ‌ల్ల మేలు చేకూరుతుంది. వ్యాపార‌లాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

అభిష్ట‌సిద్ధి ఉంది. దైవానుగ్ర‌హంతో ల‌క్ష్యాన్ని చేర‌తారు. ఆప‌ద‌లు తొల‌గుతాయి. మంచి భ‌విష్య‌త్‌ను నిర్మించుకుంటారు. విఘ్నాలున్నా శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఉంటుంది. బాధ్య‌త‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యాలు తీసుకోండి. ఖ‌ర్చు విష‌యంలో మొహ‌మాటం వ‌ద్దు. వ్యాపారంలో మిశ్ర‌మ ఫ‌లితం.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

 

శ్రేష్ట‌మైన కాలం న‌డుస్తోంది. కోరిక‌లు నెర‌వేర‌తాయి. మంచి భ‌విష్య‌త్ మీ సొంతం అవుతుంది. ప్ర‌య‌త్నాలు ఫ‌లించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో శ్ర‌మ పెరిగినా ఫ‌లితం బాగుంటుంది. ఎదురు చూస్తున్న ప‌ని పూర్తి అవుతుంది. స‌మిష్టిగా తీసుకునే నిర్ణ‌యం మేలు చేస్తుంది. వ్యాపారంలో ఉన్న‌త‌మైన స్థితి గోచ‌రిస్తోంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ముఖ్య కార్యాల్లో విజ‌యం ల‌భిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫ‌లితాలుంటాయి. ఆర్థిక పుష్టి ఏర్ప‌డుతుంది. వ్యాపార రిత్యా స్వ‌ల్ప ఆటంకాలు ఎదురైనా అంతిమంగా మంచి జ‌రుగుతుంది. మొహ‌మాటంతో కొత్త స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాలి. చంచ‌ల‌త్వం ప‌నికి రాదు. ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్లండి. ధ‌ర్మ‌మార్గంలో విజ‌యం సాధిస్తారు. న‌వ‌గ్ర‌హ శ్లోకాలు చ‌దివితే మంచిది.

Visitors Are Also Reading