Weekly Rasi Phalau in Telugu 2023 : రాశిఫలాలు చదవడం వల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది. ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Weekly Horoscope in Telugu 02.04.2023 నుంచి 08.04.2023 వరకు మేషం :
Mesha
ఉద్యోగంలో అనుకోని ఆటంకాలు ఎదుర్కుంటారు. గత అనుభవంతో తెలివిగా సమస్యను పరిష్కరించుకుంటారు. సకాలంలో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి శుభప్రదంగా ఉంటుంది.
Weekly Horoscope in Telugu 2023: వృషభం
Weekly Rasi Phalau in Telugu
ఉద్యోగ ఫలితాలు సంతోషాన్ని ఇస్తాయి. వీరికి శత్రు దోషం తొలుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపడుతారు. కొత్త ఆలోచనలతో బంగారు భవిష్యత్ లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో లాభపడుతారు.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ఉత్తమం. అధికార లాభం కలుగుతుంది. బంధు మిత్ర, సమాగమంతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా పని చేసి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. సంతృప్తికరమైన ఫలితాలుంటాయి. మిత్రుల వల్ల మేలు కలుగుతుంది.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏకాగ్రత్తతో పని చేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు చాలాఅవసరం. బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోవడం బెటర్. మిత్ర భావంతో ముందుకు సాగాలి. పట్టుదలతో చేసేటటువంటి కార్యక్రమాలు విజయాన్ని ఇస్తాయి.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతీఫలముంటుంది. ధైర్యంగా పనిని ప్రారంభించడం ఉత్తమం. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు.
Weekly Horoscope in Telugu : కన్య
Advertisement
Kanya
ఆత్మవిశ్వాసంతో పని చేస్తే ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇష్టమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారంలో శ్రద్ధ తప్పకుండా వహించాలి. ఆర్థిక ఫలితాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. బందు, మిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది.
Weekly Horoscope in Telugu : తుల
Thula
ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. మనోబలంతో లక్ష్యాన్ని అధిగమించండి. అడుగడుగునా ఆటంకపరిచే వారు ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో పని చేయడం ఉత్తమం. వ్యాపారంలో సమస్యలను తెలివిగా పరిష్కరించాలి. మొహమాటం కారణంగా ఖర్చులు అధికమవుతాయి.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని విజయం సాధించడం ఉత్తమం. ఉద్యోగంలో ప్రయత్నాన్ని బట్టి ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో పని చేయడం ఉత్తమం. పెట్టుబడులు లాభాన్ని కలిగిస్తాయి. సకాలంలో పని చేయడం ఉత్తమం. ఓ శుభవార్త వింటారు.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
ఓ విషయంలో విజయం సాధిస్తారు. బుద్ధిబలంతో పని చేసి ఉద్యోగంలో సత్ఫలితాలను పొందడం ఉత్తమం. స్థిరత్వం ఏర్పడుతుంది. గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కుటుంబ సభ్యుల సలహాలు చాలా అవసరం.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
త్వరగా పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగ ఫలితాలు సంతోషాన్ని కలిగిస్తాయి. అధికార లాభం, పదోన్నతులు కలిగిస్తారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. బుద్ధిబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. సుఖం లభిస్తుంది. మంచి పేరు సంపాదిస్తారు.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
ఉద్యోగంలో విజయం వరిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. మనస్సుకి సంతోషం కలుగుతుంది. వ్యాపారంలో ఏకాగ్రతను పెంచాలి. ఓ శుభవార్త వింటారు.
Weekly Rasi Phalau in Telugu : మీనం
Meena
వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి. ధనలాభం ఉండే అవకాశముంది. పెట్టుబడులు లాభాలను చేకూర్చుతాయి. అనుకున్నది సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో కష్టపడి చదివితే ఫలితముంటుంది. ఒత్తిడిని జయిస్తారు. నిరంతర సాధనతో కార్యసిద్ధి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.