Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023: ఈ ఏడాది  యొక్క రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి యొక్క వార ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అందరికీ మనం న్యూస్ తరపున  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu 01.01.2023 నుంచి 07.01.2023 వరకు

మేషం :

Mesha

Mesha

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆటంకాలుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. నమ్మినటువంటి బాటలో ముందుకు వెళ్లండి. కాలం చాలా వ్యతిరేకంగా ఉంది. అందరినీ అసలే నమ్మవద్దు. దగ్గరివారితో విబేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. వారాంతంలో విజయం వరిస్తుంది.

Advertisement

Weekly Horoscope in Telugu 2022: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. క్రమ క్రమంగా లాభాల బాట పడతారు. పెద్దల అండదండలుంటాయి. రోజు రోజుకు గౌరవం పెరుగుతుంది. ఇంట్లో వారితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో విజయం వరిస్తుంది. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

పట్టుదలతో పని చేస్తే సత్ఫలితాన్ని సాధిస్తారు. అతిగా ఆలోచించకూడదు. సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎవరికైనా చాలా సౌమ్యంగా సమాధానం ఇవ్వాలి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితముంటుంది. మిత్రుల అండ మీకు లభిస్తుంది. వారాంతంలో శ్రమ ఫలిస్తుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో లాభాలుంటాయి. బంగారు భవిష్యత్ కోసం మీరు చేయని ప్రయత్నం ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

మానసికంగా దృఢంగా ఉంటారు. సకాలంలో మీ పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రశాంత చిత్తంతో సమాధాం ఇవ్వాలి. ప్రతీ అడుగు ఆలోచించి వేయండి. పొరపాటు జరిగితే నష్టం ఎక్కువవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

అవసరాలకు తగినట్టు పని చేయాలి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. ఒత్తిడికి లోనవ్వకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పని చేసి అభివృద్ధి సాధిస్తారు. ఓర్పు చాలా అవసరం. ఉపద్రవాల నుంచి బయటపడతారు. 

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగం మీకు అనుకూలిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫలితం ఉంటుంది. సకాలంలో బాధ్యతలను నిర్వహించాలి. కొందరి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. దగ్గరివారితో సంప్రదింపులు చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం బెటర్.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో విశేష ధనలాభం ఉంటుంది.  ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆనందించే అవకాశముంది.

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉత్సాహంగా పనిని ప్రారంభించండి. ఆశించిన ఫలితముంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అనుకున్నవి సాధించాలి.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

మిశ్రమ కాలం ఉంది. జాగ్రత్తగా పనులు పూర్తి చేయాలి. అవసరాలకు ధనం చేకూరుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. దేనికి తొందరపడకూడదు. ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. పనులను సకాలంలో పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల సలహాలు చాలా అవసరం అవుతాయి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది.  మీరు అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్ ఇస్తాయి. ప్రతిభతో పైకి వస్తారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రశాంతంగా రోజులు గడుస్తాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలను తీసుకోండి.  సాహస కార్యక్రమాల్లో అభివృద్ధి ఉంటుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఓ సమస్యని పరిష్కరిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి.  రోజు రోజుకు ఆస్తి పెరుగుతుంది. 

Visitors Are Also Reading