Home » బోండా ఉమా కుమారుడి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

బోండా ఉమా కుమారుడి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

by Anji
Ad

తెలుగుదేశం పార్టీ కీల‌క నేత‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అంద‌రికీ పరిచ‌యం ఉన్న వ్య‌క్తే. టీడీపీలో ముఖ్య‌నేత‌గా ఉన్న బోండా ఉమాకు ఇద్ద‌రు కుమారులు. పెద్ద‌కుమారుడు సిద్ధార్థ్‌-చిన్న‌కుమారుడు ర‌వితేజ‌. ఇటీవ‌లే ఉమా పెద్ద అబ్బాయి సిద్ధార్థ్ రెడ్డి వివాహం హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన టీడీపీ కీల‌క నేత ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె బ‌స్వంతితో గ‌త కొంత‌కాలంగా సిద్ధార్థ్‌ ప్రేమ‌లో ఉన్నారు.


వీరి ప్రేమ పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం… పెద్ద‌లు కూడా అంగీక‌రించ‌డంతో వివాహ‌బంధంతో ఒక్క‌టయ్యారు. ఇటీవ‌లే వీరి వెడ్డింగ్ కు సంబందించిన కొన్ని బ్యూటిపుల్ ఫోటోలు విడుద‌ల చేసారు. ఆ ఫోటోలో ఇద్ద‌రూ చూడ‌ముచ్చ‌ట‌గా క‌నువింధు చేసారు. ముఖ్యంగా సిద్ధార్థ్-జస్వంత్ పెళ్లి ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. సిద్ధార్థ్-వెడ్డింగ్ కు సంబందించిన కొన్ని అంద‌మైన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సిద్దార్థ్‌-జ‌స్వంతి ఇద్ద‌రూ అమెరికాలో క‌లిసి చ‌దువుకున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ త‌రుణంలో వీరిద్ధ‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ‌ను ఇరు పెద్ద‌లు అంగీక‌రించ‌డంతో పెళ్లీపీట‌లెక్కారు.

Advertisement

Advertisement

రాజ‌కీయ పార్టీల నేత‌లు వియ్యంకులు కావ‌డం ఇది తొలిసారి ఏమి కాదు. గ‌తంలో గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు-పెద‌కూర‌పాడు ఎమ్మెల్యే కొమ్మ‌ల‌పాటి శ్రీ‌ధ‌ర్‌బాబు వియ్య‌కుల‌య్యారు. ఇక ఆ త‌రువాత అప్ప‌టి పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి కుమార్తెను శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా ఎర్ర‌న్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వాని ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు స్వ‌యంగా కోడ‌లు కావ‌డం విశేషం. కృష్ణా జిల్లా మాజీ మంత్రి, ప్ర‌స్తుత పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి కుమారుడు నితిన్ కృష్ణ ప్ర‌కాశం జిల్లాకు చెందిన క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్‌రెడ్డి కుమార్తె అమృత భార్గ‌విని పెళ్లి చేసుకున్నాడు.

Also Read : 

మిర్చి హీరోయిన్‌ను చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్..!

గోదుమ‌ల‌కు బ‌దులు క‌ర్ర‌పెండ‌లం తినాల‌ని ఆదేశ అధ్య‌క్షుడు చెప్పారు ఎందుకో తెలుసా..?

 

Visitors Are Also Reading