పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. అయితే కాలం మారినా కొద్దీ పెళ్లిలలో… మార్పులు కూడా వస్తున్నాయి. అలాగే పెళ్లికి ముందు ముద్రించే… పెళ్లి కార్డులు సైతం భిన్నంగా ప్రింట్ చేస్తున్నారు. కొంతమంది ఎక్కువ ధర పెళ్లి కార్డులను రెడీ చేస్తుంటే..మరి కొంతమంది మాత్రం తమ అభిమాన రాజకీయ నాయకులు లేదా సినిమా హీరోల ఫోటోలు వేసుకొని మరి పెళ్లి కార్డులు తయారు చేయించుకుంటున్నారు.
wedding card viral of pawan kalyan fan anil kumar
అయితే తాజాగా ఏపీకి చెందిన ఓ వ్యక్తి.. జనసేన పార్టీ ప్రచారానికి లాభం చేకూరేలా తన పెళ్లి కార్డును ముద్రించుకొని హాట్ టాపిక్ గా మారాడు. తిరుపతికి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి వివాహం సెప్టెంబర్ రెండో తేదీన జరిగింది. అయితే తన పెళ్లి కంటే ముందు ముద్రించిన పెళ్లి కార్డులలో… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరుతూ… డిఫరెంట్ గా పెళ్లి కార్డును తయారు చేయించుకున్నాడు.
Advertisement
Advertisement
ఆ పెళ్లి కార్డు వివరాల్లోకి వెళితే… ఒకసారి జననాయకుడు జనసేన అని పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వండి… గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ… తన పెళ్లి కార్డులో ముద్రించాడు అనిల్ కుమార్. అలాగే పవన్ కళ్యాణ్ బొమ్మ కూడా… ప్రింట్ చేయించి పెళ్లి కార్డులను పంచాడు. అయితే ఈ పెళ్లి కార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవాలని జనసేన వ్యూహాలు రచిస్తోంది.
ఇవి కూడా చదవండి
- Kodali Nani : నందమూరి వారి పెళ్ళిలో కొడాలి నాని.. పిక్ వైరల్!
- Prithvi Shaw : పాపం పృధ్వీ షాను.. శని దేవుడు అస్సడు వదలడం లేదుగా !
- ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ సిరీస్..ఉచితంగా లైవ్ టెలికాస్ట్