Home » త్వరలో గుడ్ న్యూస్ చెబుతామంటున్న..విజయ్ దేవరకొండ, రష్మిక..!!

త్వరలో గుడ్ న్యూస్ చెబుతామంటున్న..విజయ్ దేవరకొండ, రష్మిక..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్న సినీ కెరియర్ ఏ విధంగా కొనసాగుతుందో మనందరికీ తెలుసు. పలు సినిమాల సక్సెస్ లతో ఆమె పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలాంటి రష్మిక మరియు విజయ్ దేవరకొండ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు. ఈ తరుణంలోనే రష్మిక మందాన త్వరలో ఆ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్, రష్మిక ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇంతకీ ఆ విషయం ఏంటయ్యా అంటే..

Advertisement

also read:Punarnavi : అనారోగ్యానికి గురైన మరో హీరోయిన్‌.. ఊపిరితిత్తుల సమస్యతో..

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్ అనిపించుకున్న హీరో హీరోయిన్స్ అని చెప్పవచ్చు. వీరు మొదటిసారి కలిసి నటించిన చిత్రం గీతాగోవిందం. ఇందులో వీరికి కాంబినేషన్ ఫ్యాన్స్ ని ఎంత ఉత్సాహపరిచిందో మనందరికీ తెలుసు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. “ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే” అనే సాంగ్ వీరిద్దరికి ఎంతో సూట్ అయింది. దీంతో జనాల్లో వీరిపై ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయింది. దీంతో ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇదే ఊపుతో డియర్ కామ్రేడ్ చేశారు. కానీ ఆ సినిమా అనుకున్నంత హిట్ ఇవ్వలేదు. కానీ వీరి కాంబో ప్రేక్షకులను ఎంతగానో ఆనందపరిచింది. ఇక అప్పటినుంచి విజయ్ రష్మికలు చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఏదో ఒక విధంగా కెమెరాల కంటపడుతున్నారు.

Advertisement

దీంతో మీ మధ్య ఏం జరుగుతుందని ప్రశ్నించిన వారికి మేము మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటూనే గోవా, మాల్దీవ్స్ వంటి టూర్లకు వెళుతున్నారు. ఇదిలా ఉండగా విజయ్,రష్మికలు తెరపై మళ్ళీ కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ మా ఇద్దరికీ సూట్ అయ్యే మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా చేస్తాము అనే విధంగా ఒక హింట్ ఇచ్చింది. ప్రజెంట్ విజయ్ తో ఏ సినిమా చేయట్లేదు. ఏడాది చివరి వరకు లేదంటే వచ్చే ఏడాది వరకు తప్పకుండా స్క్రీన్ షేర్ చేసుకుంటానని తెలియజేసింది. మంచి కథ దొరికితే ఈ ఏడాది ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతానని చెప్పకనే చెప్పింది. దీంతో రష్మిక మరియు విజయ్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి విజయ్ రష్మిక బంధంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి.

also read:

Visitors Are Also Reading