భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించబడుతుంది. ప్రకృతి ఆశీర్వాదం గా అభివర్ణించబడే ఆహారాన్ని అత్యంత గౌరవంతో భావిస్తారు. అందుకే భుజించే ముందు కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. భోజనం వడ్డించిన అరటి ఆకు లేదా ప్లేట్ చుట్టూ నీటిని చిలకరించడం ఇందులో ఒకటి కాగా..పూర్వీకులు ఆచరించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ వారసత్వంగా కొనసాగుతూనే ఉంది.
Advertisement
ఇంతకీ ఎందుకీ ఆచారం? దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? చిత్రహుతిగా పిలువబడే ఈ పద్ధతిని ఉత్తర,దక్షిణ భారతంలోనూ పాటిస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణ కమ్యూనిటీలు తప్పకుండా ఫాలో అయ్యే ఈ సంప్రదాయంలో ఆధ్యాత్మిక కోణం ఉంది. ఇలా చేయడాన్ని ఆహారాన్ని ముందుగా దేవునికి సమర్పించినట్లుగా భావిస్తారని, కడుపు నింపుకునేందుకు భోజనం అనుగ్రహించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలపడమని విశ్వసిస్తుంటారు.
Advertisement
అలాగే అటవీ ప్రాంతాల్లో మట్టి ఇళ్లలో నివసించే ఋషులు ఈ ఆచారాన్ని ప్రారంభించారని నమ్ముతారు. నేలపై అరటి ఆకును పరిచినప్పుడు దాని చుట్టూ ఉన్న మట్టి లేదా దుమ్ము రేణువులు ఆహారంలో పడకుండా అణిచివేసేందుకు నీటిని చిలకరించేవారనేది ఒక వాదన. ఇలా చేయడం వల్ల కీటకాలు, చీమలు ఆ నీటిని దాటి రాలేవు.
ALSO READ;
దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్న పదం వచ్చినట్టే ఆ పదం కూడా వచ్చింది : విశ్వక్ సేన్
అన్నగారు నాకో ఛాన్స్ ఇవ్వండని అడిగిన కైకాల..ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!