Home » Viral Video : భువ‌నేశ్వ‌ర్ క్యాచ్ వ‌దిలేయ‌డంతో.. కెప్టెన్ రోహిత్ కోపంతో బంతిని ఎలా త‌న్నాడో చూడండి

Viral Video : భువ‌నేశ్వ‌ర్ క్యాచ్ వ‌దిలేయ‌డంతో.. కెప్టెన్ రోహిత్ కోపంతో బంతిని ఎలా త‌న్నాడో చూడండి

by Anji
Ad

భార‌త్-వెస్టిండిస్ మూడు టీ-20 సిరీస్ లో భాగంగా శుక్ర‌వారం రెండ‌వ టీ-20 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో చివ‌రికీ టీమిండియా గెలిచిన‌ప్ప‌టికీ ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార‌త పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్‌కుమార్ 16 వ ఓవ‌ర్‌లో బౌలింగ్ చేశాడు. తాను వేసిన ఓ బాల్ కు రోవ్‌మ‌న్ పావెల్ బంతిని గాలిలోకి లేపాడు. భువ‌నేశ్వ‌ర్ దానిని క్యాచ్ ప‌ట్టిన‌ట్టే ప‌ట్టినా.. అది చేతిలోంచి జారీ కింద ప‌డిపోయింది. దీంతో భార‌త కెప్టెన్ రోహిత్ నిరాశ చెందాడు.

Also Read : పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా మహేష్ బాబు, కేటీఆర్…!

Advertisement

భువ‌నేశ్వ‌ర్ కుమార్ స‌మీపంలో నిల‌బ‌డి ఉన్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భువి క్యాచ్ విడిచిపెట్ట‌డంతో నిరాశ చెంది అత‌ను బంతిని ఆవేశంగా త‌న్నాడు. ఇదిలా ఉండ‌గా.. ఈ మ్యాచ్ గెల‌వ‌డంలో భువ‌నేశ్వ‌ర్ కీల‌క పాత్ర వ‌హించాడ‌నే చెప్ప‌వ‌చ్చు. భువి త‌న 19వ ఓవ‌ర్ మూడ‌వ బంతికి నికోల‌స్ పూర‌న్ ఇన్నింగ్స్ ను ముగించాడు. నికోల‌స్ పూర‌న్ 41 బంతులు ఎదుర్కొని ఐదు పోర్లు, మూడు సిక్సుల 62 ప‌రుగులు సాధించాడు. మ్యాచ్ వెస్టిండిస్ గెలుస్తుంద‌న్న త‌రుణంలో భువి మ్యాచ్ ను అక్క‌డి నుంచి మ‌లుపు తిప్పాడు. చివ‌రి ఓవ‌ర్‌లో 25 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. కేవ‌లం హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో ఉత్కంఠ నెల‌కొంది. చివ‌రి రెండు బంతుల్లో 11 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. చివ‌రి రెండు బంతులు స్లోగా వేయ‌డంతో 8 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది.

Advertisement

https://twitter.com/i/status/1494718969705480194

ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున తొలుత విరాట్ కోహ్లీ (52), చివ‌రిలో రిష‌బ్ పంత్ (52) అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో విండిస్ జ‌ట్టు మూడు వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. నికోల‌స్ పూర‌న్ (62), రోవ్‌మ‌న్ పావెల్ (68 నాటౌట్‌) మ్యాచ్‌ను గెలిపించేందుకు పోరాడినా.. చివ‌రికీ విజ‌యం ద‌క్కించుకోలేదు.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి శారీక‌ర శ్ర‌మ పెరుగుతుంది

Visitors Are Also Reading