ఐపీఎల్ 2022 ను వరుస పరాజయాలతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇప్పుడు వరుస విజయాలను అందుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఓటమి ఎరుగని గుజరాత్ జట్టుకు దానిని పరిచడం చేసింది. అయితే ఇప్పుడిపుడే జట్టు కుదురుకుంటుంది అనుకున్న సమయంలో… సన్ రైజర్స్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. మొదటి నుండి మంచి ప్రదర్శన చేస్తూ.. జట్టులో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా జట్టుకు దూరం అవుతున్నాడు.
Advertisement
Read Also : లంక నుంచి ఆసియా కప్ ఔట్..?
అయితే ఈ విషయాన్ని స్వయంగా జట్టు హెడ్ కోచ్ టామ్ మూడీ ప్రకటించారు. నిన్నటి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సుందర్ చేతికి గాయం కావడంతో.. తనబౌలింగ్ కోటాను పూర్తి చేయకుండానే మధ్యలోనే క్రీజునుండి బయటకు వచ్చేసాడు.మ్యాచ్ అనంతరం అతడి గాయని స్కాన్ చేయగా.. కుడి చేతి యొక్క రెండు వేళ్ళ మధ్యలో గాయం అయినట్లు తెలిసింది. దాంతో అతడికి కనీసం రెండువారాలు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు.
Advertisement
Read Also : పాండ్య హాఫ్ సేచరోతో ఉద్యోగం కోల్పోయిన యువకుడు..!
Advertisement
ఇదే విషయాన్ని టామ్ మూడీ వెల్లడిస్తూ.. సుందర్ కు కనీసం రెండు వారలు విశ్రాంతి కావాలని వైద్యులు తెలిపారు. కాబ్బటి అతడు జట్టుకు అందుబాటులో ఉండడు. నందువల అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకుంటాం అని చెప్పారు. కానీ సుదర్ రెండు వరాల తర్వాత కూడా జట్టుకు అందుబాటులోకి వస్తాడా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి. గత ఐపీఎల్ లో కూడా ఇలాంటి సమస్యతోనే భాధపడిన సుందర్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి.