Home » న‌రేష్ ప‌విత్ర లోకేష్ హోట‌ల్‌లో క‌ల‌వ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

న‌రేష్ ప‌విత్ర లోకేష్ హోట‌ల్‌లో క‌ల‌వ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ad

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్య‌గా కొద్ది రోజుల కింద‌ట ఓ హోట‌ల్‌లో వీరు క‌లిసి క‌నిపించ‌డం సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌నే కొన‌సాగింది. న‌రేష్ మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి ఆ స‌మ‌యంలో ప‌విత్ర లోకేష్ పై చెప్పుతో దాడి చేసేందుకు య‌త్నించ‌డం సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనే ఓ సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘ‌ట‌న విష‌యంపై కొంత మంది ర‌మ్య ర‌ఘుప‌తిని ట్రోల్ చేయ‌గా.. మ‌రికొంత మంది మాత్రం ఆమెను స‌మ‌ర్థించ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

 

న‌రేష్ ప‌విత్ర లోకేష్ ఆ హోట‌ల్‌లో క‌లిసి ఉండ‌డం వెనుక కార‌ణం వేరే ఉన్న‌ద‌ని తెలుస్తోంది. ర‌మ్య ర‌ఘుప‌తి నుంచి విడాకులు తీసుకోవాల‌ని న‌రేష్ ప్ర‌తిస్తున్న‌ప్ప‌టికీ ఆమె విడాకులు ఇవ్వ‌డానికి అస్స‌లు అంగీక‌రించ‌డం లేద‌నే సంగతి తెలిసింది. న‌రేష్‌, ప‌విత్ర హోట‌ల్‌లో ఉన్నార‌నే విష‌యాన్ని ర‌మ్య‌కు తెలిసేవిధంగా చేశాడ‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇలా చేయ‌డం ద్వారా ర‌మ్య ర‌ఘుప‌తి గొడ‌వకు దిగ‌డం మీడియా కంట ప‌డ‌డం అన్నీ అలా జ‌రిగిపోయాయి. ఈ గొడ‌వ మూలంగా న‌రేష్‌కు సులువుగా విడాకులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Advertisement


ఒకే హోట‌ల్‌లో మేజ‌ర్ ఆడ‌, మ‌గ క‌లిసి క‌నిపించినా వాళ్ల‌కు శిక్ష ప‌డ‌దు అనే విష‌యం తెలిసిందే. అయితే న‌రేష్ స‌న్నిహితుల నుంచి ర‌మ్య‌కు ఈ స‌మాచారం అందింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఒక‌వేళ న‌రేష్ ప‌విత్ర లోకేష్ పెళ్లి చేసుకుంటే అది క‌చ్చితంగా సంచ‌ల‌నం అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రోవైపు ప‌విత్ర గురించి ఆమె భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌ను చేసిన విష‌యం విధిత‌మే. ఇక ప‌విత్ర లోకేష్ త‌న‌కు సుచేంద్ర ప్ర‌సాద్‌తో అసలు పెళ్లినే జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌గా.. సుచేంద్ర ప్ర‌సాద్ మాత్రం ప‌విత్ర‌తో త‌న‌కు పెళ్లి జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ప‌విత్ర నా భార్య అని, నా పాస్‌ఫోర్ట్‌లో నా భార్య పేరు ప‌విత్ర లోకేష్ అని ఉంద‌ని గుర్తు చేయ‌డం విశేషం.

Also Read : 

మెగా హీరోతో పాన్ ఇండియా ప్లాన్స్ లో ఉన్న సుజిత్…?

సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొన‌సాగుతున్న ఆచార్య‌..!

Visitors Are Also Reading