Home » ఆచార్యతో 20 కోట్లు మునిగిన వరంగల్ శ్రీను…!

ఆచార్యతో 20 కోట్లు మునిగిన వరంగల్ శ్రీను…!

by Azhar
Ad

మన టాలీవుడ్ లో థియేటర్ల పైన గుత్తాధిపత్యం అనేది చాలా కొనసాగుతుంది. ఆంధ్ర మొత్తం అల్లు అరవింద్ చేతిలో యూనిట్ మన నైజం మొత్తం దిల్ రాజు చేతిలో ఉన్నాయి అని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే దిల్ రాజు గుత్తాధిపత్యాన్ని డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను గట్టిగ ప్రశ్నించారు. ‘క్రాక్‌’ సినిమా సమయంలోనే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement

ఈ సినిమా 9 జనవరి 2021న విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే ‘క్రాక్’ విడుదలైన నాలుగు రోజుల తర్వాత విజయ్ ‘మాస్టర్’ సినిమా వచ్చింది. అయితే ‘క్రాక్‌’ సినిమా మంచి వసూళ్లు రాబట్టినా… చాలా థియేటర్ల నుండి ఆ సినిమా తీసేశారని వరంగల్‌ శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ‘మాస్టర్’ కు థియేటర్‌ లు ఇచ్చారని… గట్టిగా పోరాడి వార్తల్లో నిలిచాడు. దీంతో వరంగల్ శ్రీను, దిల్ రాజుల మధ్య భారీ పోటీ నడిచిందని సమాచారం.

Advertisement

అయితే ఈ మధ్య ‘అఖండ’, ‘పుష్ప’, ‘RRR’, ‘KGF 2’ వంటి సినిమాలతో దిల్ రాజు కు భారీ లాభాలు రావడంతో… వరంగల్ శ్రీను మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ నైజాం హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశాడు. ‘ఆచార్య’ నైజాం హక్కుల కోసం ఆయన 40 కోట్లకు పైగా వెచ్చించారని. ఈ ‘ఆచార్య’తో నైజాంలో దిల్ రాజుకి గట్టిపోటీ యవలని ఆయన చూసాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన ప్లాన్లన్నీ తారుమారయ్యాయి. వరంగల్ శ్రీను ‘ఆచార్య’ సినిమాకి పెట్టిన ఖర్చులో దాదాపు 50 శాతం నష్టపోయే అవకాశం ఉందని సమాచారం. మరి ఓటమి నుంచి కోలుకుని మళ్లీ దిల్ రాజుకు గట్టి పోటీని ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి :

షేన్ వార్న్ కు రాజస్థాన్ ఘన నివాళి..!

ఎలన్ మస్క్ కు దానిని కొనమని మెసేజ్ చేసిన గిల్..

Visitors Are Also Reading