Home » మెగాస్టారా మజాకా…కలెక్షన్స్ లో ఆర్ఆర్ఆర్ ను బీట్ చేసిన వాల్తేర్ వీరయ్య….!

మెగాస్టారా మజాకా…కలెక్షన్స్ లో ఆర్ఆర్ఆర్ ను బీట్ చేసిన వాల్తేర్ వీరయ్య….!

by AJAY
Ad

చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక 68 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి డ్యాన్సులు ఫైట్లతో ఇరగదీశాడు.

Advertisement

మరోసారి వింటేజ్ చిరంజీవి ప్రేక్షకులకు కనిపించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు అరుదైన రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాకు భారీ కలెక్షన్ లు వస్తున్నాయి. మొదట ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ ల దిశగా దూసుకుపోతోంది.

Advertisement

అంతేకాకుండా చిరంజీవి రీఎంట్రీ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయన స్పెషల్ గా కనిపించారని కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్ లను సైతం బీట్ చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాడిపత్రి ఏరియాలో ఈ రికార్డును వాల్తేరు వీరయ్య క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.

తాడిపత్రిలో ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన కలెక్షన్ ల కంటే ఇప్పటివరకు వాల్తేరు వీరయ్యకే ఎక్కువ వచ్చినట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. దాంతో చిరంజీవి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఫుల్ రన్ లో ఇండస్ట్రీ హీట్ గా నిలిచే అవకాశం ఉందని సైతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Visitors Are Also Reading