Waltair Veerayya Movie Review: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయనలో జోష్ తగ్గలేదు.. కానీ రీఎంట్రీ తర్వాత ప్రతి సినిమాలో ఇతర హీరోలతో కలిసి నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 లో తన కొడుకు రామ్ చరణ్ తో స్క్రీన్ పంచుకున్నారు. దీని తర్వాత అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, వంటి వారితో వీరసింహారెడ్డితో అలరించారు. ఇక ఆచార్య సినిమాలో తన తనయుడు రామ్ చరణ్ తో, తర్వాత గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజతో కలిసి తెరను పంచుకున్నారు చిరంజీవి. ప్రస్తుతమే మూవీ సంక్రాంతి బరిలో ఉండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
Advertisement
Waltair Veerayya Review Telugu
Also Read:నాటునాటు పాట కోసం జక్కన్న ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?
Waltair Veerayya Review Telugu: నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి పాత్ర చాలా ఎంటర్టైనింగా సాగుతూ ఉంటుంది. రవితేజ తెలంగాణ యాసలో పోలీసు ఆఫీసర్ గా ఆకట్టుకున్నారు. శృతిహాసన్ కూడా రా ఆఫీసర్ గా తనదైన శైలిలో ఫైట్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. ప్రకాష్ రాజ్, బాబీ సింహా,షకలక, శంకర్, శ్రీనివాసరెడ్డి, ప్రదీప్ రావత్, ,వెన్నెల కిషోర్,రాజేంద్రప్రసాద్
వంటి వారు తమ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.
Advertisement
Waltair Veerayya Story కథ :
జాలారిపేటలో ఉండే వాల్తేరు వీరయ్య అంటే అక్కడి వారికి చాలా ఇష్టం. ఆయన చెప్పిందే శాసనం. కానీ ఆయన తెలియకుండా కొందరు సముద్రపు ఒడ్డున *గ్స్ బిజినెస్ చేస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏసీబీ విక్రమ్ సాగర్ జాలరి పేటకు వెళ్లి ఆ బిజినెస్ చేసే వారిని అరెస్ట్ చేస్తారు. అడ్డొచ్చిన వీరయ్యను పట్టుకు పోతాడు విక్రమ్. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే విక్రం మరియు వీరయ్య ఓకే తండ్రి బిడ్డలు. కాను తల్లులు వేరు. ఒకరంటే ఒకరికి అభిమానం ఉన్న ఆ పరిస్థితుల కారణంగా బయటకి చెప్పుకోరు. ఆ డ్ర * బిజినెస్ కు సాలమోన్ సీజర్ ముఖ్య సూత్రధారి. ఇక వీరయ్య జైల్లో ఉన్న సమయంలో విక్రం దుండగుల చేతిలో మరణిస్తాడు. అలా తమ్ముడు మరణానికి కారణం ఏమిటి..? ఏం జరిగింది? అని తెలుసుకోవడానికి మలేషియా వెళ్తాడు వీరయ్య.
Waltair Veerayya Review Telugu
Waltair Veerayya Review విశ్లేషణ :
సినిమా కొత్తగా ఏమీ కనిపించడం లేదు. గతంలో మనం ఇలాంటి కథతో చాలా సినిమాలు చూశాం. కానీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు బాబి. ఫస్ట్ ఆఫ్ మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి ఎంటైన్మెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక బాబీ సెకండాఫ్ లో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం మాత్రం చేశాడు. సెకండ్ హాఫ్ లో రవితేజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఉపందుకుంటుంది. మధ్యలో శృతిహాసన్ వచ్చి ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక జాలారిపేటలో ఉండే వీరయ్యకు సాగర్ కు మధ్య బంధుత్వం ఏమిటి.. వివేక్ మృతికి కారణం ఏమిటి.. వీరయ్య పగ ఎలా తీర్చుకుంటాడు . అనే బేస్ లో బాబీ తనదైన మార్కుతో తెరకెక్కించారు. ఫస్టాప్ చాలా ఆసక్తికరంగా కొనసాగిన , సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీసాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన కథ అయినా కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరినీ ఆకట్టుఉంటుంది. ఏది ఏమైనా సినిమా మాత్రం గట్టెక్కించే అవకాశాలు కనబడుతున్నాయి.
ప్లస్ పాయింట్స్:
చిరంజీవి కామెడీ
రవితేజ పాత్ర
ఆకట్టుకునే సాంగ్స్
మైనస్ పాయింట్స్ :
కథలో కొత్తదనం లేకపోవడం.
సాగదీయడం.
రేటింగ్ :
2.75/5
Advertisement
Also Read:ఆ స్టార్ హీరోయిన్ ను మాత్రమే కోడలా అంటూ NTR పిలిచేవారు..ఎందుకు ఆమె అంత స్పెషల్ ?