Home » మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కథ అదేనా ? 

మెగాస్టార్ వాల్తేరు వీరయ్య కథ అదేనా ? 

by Anji
Ad

Waltair Veerayya Story, cast: మెగాస్టార్ చిరంజీవి దసరాకి గాడ్ ఫాదర్ సినిమాతో సందడి చేసిన విషయం విధితమే.  ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది. కానీ చివరి వరకు అనుకున్న స్థాయిలో నిలబడలేకపోయింది. మొత్తానికి చిరుకు ఓ మోస్తారు ఫలితాన్ని అయితే అందించిందనే చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.  దసరా పండుగ సందర్భంగా వచ్చిన గాడ్ ఫాదర్ రీమేక్ కావడం వల్ల ప్రీ రిలీజ్ బజ్ పెద్దగా కనిపించలేదు. కానీ వాల్తేరు వీరయ్య అన్ని రకాలుగా అభిమానులను అలరిస్తుందనే అంచనాలు అయితే ఉన్నాయి. 

Waltair veraiah Story

Waltair veraiah Story

 

ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ చిరంజీవి సోదరుడి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. రవితేజపై ఓ అవినీతి ముద్ర పడి అప్రతిష్ట పాలైతే దానిని చెరిపేసేందుకు చిరంజీవి చేసే ప్రయత్నమే వాల్తేరు వీరయ్య అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర దాదాపు 40 నిమిషాల నిడివి ఉంటుందట.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతుండగా..  ప్రకాశ్ రాజ్, సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  

Advertisement

Advertisement

ఇటీవల విడుదలైన టీజర్ లో చిరంజీవి లుక్ మాస్ తరహాలో కనిపిస్తోంది. ముఖ్యంగా ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, రిక్షావోడు తరహాలో వాల్తేరు వీరయ్య లో చిరంజీవి మాట తీరు కనిపిస్తోంది. చాలా వరకు మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆచార్య అట్టర్ ఫ్లాప్ తరువాత గాడ్ ఫాదర్ తో విజయాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకానున్న వాల్తేరు వీరయ్య ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. 

Also Read :  టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగిన హీరో ఎవరు ? టాప్ లో ఉన్నది ఏ హీరో అంటే ?

Visitors Are Also Reading