టాలీవుడ్ బ్యూటీ హెబ్బా పటేల్ పేరు వినగానే ఎవరికైనా కుమారి 21 ఎఫ్ మూవీనే గుర్తుకొస్తుంది. ఆ సినిమా తరువాత హెబ్బాకు గ్లామర్ రోల్స్ చాలా ఎక్కువగానే వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలలో ఆమెకు గ్లామర్ కాకుండా పెర్ఫార్మన్స్ స్కోన్ ఉన్నటువంటి రోల్స్ లభిస్తున్నాయి. అందుకు ఉదాహరణనే ఓదెల రైల్వే స్టేషన్. తాజాగా ఇప్పుడు ‘వ్యవస్థ’ వెబ్ సిరీస్ లో నటించారు.
Also Read : PS-2 REVIEW&RATING: పొన్నియన్ సెల్వన్ 2 టాక్ అదిరిపోలా..?
Advertisement
వ్యవస్థ వెబ్ సిరీస్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహించగా.. హెబ్బాపటేల్ తో పాటు కార్తీక్ రత్నం, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. జీ 5 ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణు ప్రసాద్ నిర్మించిన ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ వెబ్ సిరీస్ తర్వాత ‘జీ 5’ కోసం ఆనంద్ రంగా తీసిన సిరీస్ ఇది. కథ విషయానికి వస్తే.. భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం ఎలా ఉంటుంది. భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకునే సందర్భాలు ఎలా ఉన్నాయి ? భర్తను భార్యనే హత్య చేసిందా ? లేక వేరే ఎవరైనా హత్య చేశారా ? అసలు హీరోయిన్ హెబ్బా పటేల్ జైలుకు ఎందుకు వెళ్తుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం ‘వ్యవస్థ’ మూవీ చూడాల్సిందే.
Advertisement
Also Read : Agent Review : ఏజెంట్ రివ్యూ… అఖిల్ మూవీకి ఊహించని షాక్…!
ఈ సినిమాలో యామిని పాత్రలో హెబ్బా పటేల్ అద్భుతమైన నటన కనబరిచారు. ఆమె ఓ సందర్భంలో జైలుకు వెల్తారు. మరోవైపు కామ్నా జెఠ్మలాని కూడా ఇందులో కనిపించడం విశేషం. కార్తిక్ రత్నం, సంపత్ రాజ్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని కోర్టు సీన్లు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. క్రైమ్ నేపథ్యంలో రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో ప్రేక్షకులు ఈ సిరీస్ మీద ఆసక్తి చూపించే అవకాశముంది. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం ఒకసారి ఓటీటీలో వీక్షించాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
హెబ్బా పటేల్ నటన
కోర్టులో సీన్లు
మైనస్ పాయింట్స్ :
కథ స్లోగా సాగడం
మధ్య మధ్యలో బోర్ కొట్టడం
Also Read : ఏజెంట్ సినిమాకి కలెక్షన్లు ఎంత వస్తే హిట్ అవుతుందో తెలుసా ?