Home » వివో పై ఈడీ దాడులు.. కోహ్లీకి గట్టి షాక్..!

వివో పై ఈడీ దాడులు.. కోహ్లీకి గట్టి షాక్..!

by Azhar
Ad
ప్రస్తుతం ఇండియాలో వివో అనేది పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఈ వివో అనే ఫోన్స్ కంపినీ ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందింది. కానీ తాజాగా ఈ కంపెనీ చేసిన మోసం అనేది తెలిసిన తర్వాత అందరూ దీనిపై విమర్శలు అనేవి గుప్పిస్తున్నారు. ఈ కంపెనీ మనల్ని మోసం చేసి 62,476 కోట్లా రూపాయలని భారత ప్రభుత్వానికి పన్ని అనేది కట్టకుండా చైనాకు తరలించింది. ఈ విషయం తెలుసుకున్న ఈడీ సంస్థ వివో పై దాడులు అనేవి చేయడం ప్రారంభించింది. ఒక్కే సమయంలో ఏకంగా 23 రాష్ట్రాల్లో 48 ప్రాంతాల్లో దాడులు చేసింది.
అయితే వివో పై ఈడీ దాడులు చేస్తే కోహ్లీకి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ నుండి మాత్రమే కాకుండా యాడ్స్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఇక కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవరిస్తుంటూ ఉంటాడు. ఇక ఇదే తరహాలో గత ఏడాదే విరాట్ కోహ్లీ ఈ వివోను ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ వివో కు సంబంధించిన కొని యాడ్స్ లో కూడా నటించాడు. కానీ వివో ఇప్పుడు ఈ యాడ్స్ ను నిలిపివేసింది.
వివో కంపెనీలపై దాడులు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ యొక్క అన్ని యాడ్స్ ను ఆపేస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇది కేవలం కొంత సమయానికి మాత్రమే అని.. మళ్ళీ పరిస్థితుకు అనేవి అన్ని చక్కబడక కోహ్లీ యాడ్స్ ను విడుదల చేస్తాం అని చెప్పింది. ఇలా చేయడం ద్వారా కోహ్లీకి కూడా లాభం అని పేర్కొంది. ఎందుకంటే ఇటువంటి సమయంలో కోహ్లీ యాడ్స్ అనేవి వస్తే అందరూ అతడిని విమర్శిస్తారు అని.. కానీ ఇప్పుడు కోహ్లీకి ఆ సమస్య అనేది ఉండకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లు వివో ప్రకటించింది.

Advertisement

Visitors Are Also Reading