Home » NTR వ‌ద్దు అనుకున్న ఈ సినిమా…… తెలుగు సినిమాల‌కు ఓ బెంచ్ మార్క్!

NTR వ‌ద్దు అనుకున్న ఈ సినిమా…… తెలుగు సినిమాల‌కు ఓ బెంచ్ మార్క్!

by Azhar
Ad

తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత ఆయన సొంతం. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ… ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయన మేకింగ్‌ మీద సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అలాంటిది. అందుకే విఠలాచార్య దర్శకత్వం వహించినా, నిర్మించినా… ఆ సినిమాలను ప్రదర్శించే థియేటర్లు హౌస్‌ఫుల్స్ తో కళకళలాడేవి. తరాలు మారినా ఆయన సినిమాలను చూడని, పొగడని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో!

Advertisement

దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్ ఈ త‌రం వారికి చాలా మందికి తెలియ‌ద‌నే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న ఓసారి ఎన్టీర్‌తో సినిమా చేయాల‌ని క‌థను సిద్ధం చేసుకుని ఎన్టీరామారావు ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. ఆయ‌న వేరే చిత్రాల‌తో బిజీగా ఉండ‌డంతో నేను చేయ‌లేను అని చెప్పారు. దాంతో విఠ‌లాచారికి కోపం వ‌చ్చి వెంట‌నే క‌మెడియ‌న్ గా అలాగే కొన్ని చిత్రాల్లో చిన్న హీరోగా అప్పుడ‌ప్పుడే పాత్ర‌ల్లో న‌టించిన న‌ర్సింహ‌రాజుని హీరోగా తీసుకుని సినిమాని తీశారు. అప్ప‌ట్లో ఆ చిత్రం సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. ఒక్క‌సారిగా ఆయ‌న ఆ చిత్రంతో టాప్ స్టార్‌గా ఎదిగిపోయార‌నే చెప్పాలి.

Advertisement

అదే జ‌గ‌న్మోహిని చిత్రం ఆ చిత్రం ఇప్ప‌టి త‌రం పిల్ల‌ల‌కు చూపించినా కూడా ఆ కామెడీని

ల్ల‌ల‌కు చూపించినా కూడా ఆ కామెడీని అంత‌గా ఆశ్వాదిస్తారు. అప్ప‌ట్లో ఆ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇక విఠ‌లాచారి వ్య‌క్తిత్వం ఏ విధంగా ఉంట‌దంటే ఆయ‌న చిత్రంలో న‌టించే ఎవ‌ర‌యినా ఆర్టిస్టులు ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టిన‌ట్లు అనిపిస్తే వెంట‌నే ఆ పాత్ర‌ను ముగించే విధంగా క‌థ‌ను మ‌లుచుకుంటారు. అది ఏ విధంగా అంటే ఆయ‌న చిత్రాల్లో ఎక్కువ‌గా

ఎక్కువ‌గా మునీశ్వ‌రులు, శాపాలు వంటివి ఉంటాయి. ఆయ‌న‌కి అవ‌స‌రం లేదు అనిపిస్తే మునీశ్వ‌రుడు శాపం పెట్టి కుక్క‌నో, మేక‌నో లేదా ఏ రాయిగానో మార్చేస్తాడు. తిరిగి ఆ శాతం సినిమా ముగింపు అప్పుడు మ‌ళ్ళీ శాప విముక్తి అయి ఆ పాత్ర‌కి ప్రాణం పోస్తాడు. అలాంటి జిమ్మిక్కుల‌న్నీ ఒక్క విఠ‌లాచారి సినిమాల్లోనే చూడ‌గ‌లం.

Visitors Are Also Reading