Virupaksha movie Review : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా మూవీ “విరూపాక్ష”. ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. తేజ్ కి బైకు యాక్సిడెంట్ అయిన తరువాత నటించిన ఫస్ట్ సినిమా ఇది. దీంతో ఈ మూవీపై చాలా ఆసక్తి నెలకొంది. మరోవైపు రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా థ్రిల్లర్ కాన్సెప్ట్ ని ఎంపిక చేసుకోవడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగింది.
Advertisement
సినిమా : విరూపాక్ష
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
బ్యానర్స్ : శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్
స్క్రీన్ ప్లే : సుకుమార్
దర్శకత్వం : కార్తిక్ దండు
సినిమాటోగ్రాఫర్ : శ్యామ్ దత్ సాయినుద్దీన్
సంగీతం : బి.అజనీష్ లోక్ నాథ్
ఎడిటర్ : నవీన్ నూలి
కథ :
భయాన్ని కలిగించే ఓ సెటప్ మధ్య వైలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. 1979 నేపథ్యంలో ప్రారంభమైన ఈ సినిమా మళ్లీ 1991కి మారుతుంది. రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు భయంకరంగా ఉంటాయి. ఆ మరణాలకు కారణం ఎవరు ? ఎందుకు చంపుతున్నారనేది ఈ సినిమా కథ. దీనికి తోడు లవ్ ట్రాక్ కూడా కొనసాగుతుంది. దర్శకుడు కార్తీక్ దండు విరూపాక్ష కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారనే చెప్పవచ్చు.
Advertisement
విశ్లేషణ :
దర్శకుడు కార్తీక్ దండు ఎలాంటి డివియషన్ లేకుండా కథను ఫర్ఫెక్ట్ ప్రజెంట్ చేశారు. అక్కడక్కడ కాస్త స్లోగా సాగినప్పటికీ అది పెద్ద మైనస్ మాత్రం కాదు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటనలో విలీనమయ్యారు. ముఖ్యంగా రుద్రవరం గ్రామంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సెకండాఫ్ పెరిగిపోతుంది. సెకండాప్ లో వచ్చే రుద్రవరం గ్రామం బ్యాక్ స్టోరీ మంచి థ్రిల్ గా ఉంటుంది. ఓ చంద్రముఖి, అరుంధతి వంటి సినిమాలను గుర్తు చేస్తుంది. ఫస్టాప్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టేశారు. ఫస్ట్ హాప్ లో లవ్ సీన్స్ కాస్త బోరు కొట్టిస్తాయి. అయినప్పటికీ కథలోని అంశాలు మాత్రం సూపర్ వర్కవుట్ అయ్యాయి. హర్రర్ థ్రిల్లర్ కి కావాల్సిన విధంగా బీజీఎం అదిరిపోయింది. మొత్తానికి విరూపాక్ష మూవీని మాత్రం థియేటర్ లో వీక్షించాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
- కథ
- నటీనటులు
- హీరో, హీరోయిన్ నటన
- స్క్రీన్ ప్లే
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
- సాగదీత సన్నివేశాలు
- లవ్ ట్రాక్ రేటింగ్ : 3/5