Telugu News » Blog » కేఎస్ భరత్ పై విరాట్ కోహ్లీ సీరియస్.. అందుకోసమేనా..? 

కేఎస్ భరత్ పై విరాట్ కోహ్లీ సీరియస్.. అందుకోసమేనా..? 

by Anji
Ads

బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. 364బంతుల్లో 186 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీని 14 పరుగుల తేడాతో మిస్ చేసుకున్నాడు. కోహ్లీ తన కెరీర్ లో టెస్ట్ లలో 28వ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 75వ సెంచరీ చేశాడు. కోహ్లీ భారీ శతకంతో టీమిండియా మంచి స్కోరు చేయగలిగింది. పిచ్ ఫ్లాట్ గా ఉండడంతో ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో కే.ఎస్. భరత్ పై విరాట్ కోహ్లీ సీరియస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisement

Also Read :  Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌

రవీంద్ర జడేజా 28 పరుగులు చేసి ఔట్ అవ్వగా.. ఆ తరువాత క్రీజు లోకి కే.ఎస్. భరత్ వచ్చాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అద్భుతంగా స్ట్రైక్ రొటెట్ చేస్తున్న సమయంలో టాడ్ మర్ఫి వేసిన 118వ ఓవర్ లో స్లో షాట్ ఆడి సింగిల్ కోసం పరుగెత్తాడు.  అవతలి ఎండ్ లో ఉన్నటువంటి భరత్ కొంచెం ముందుకొచ్చి మళ్లీ కోహ్లీకి నో చెప్పాడు. అప్పటికే చాలా ముందుకొచ్చిన కోహ్లీ మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో తృటిలో రనౌట్ ని తప్పించుకున్నాడు.  పరిగెత్తాడు. అవతలి ఎండ్‌లో ఉన్న భరత్.. కొంచెం ముందుకు వచ్చి మళ్లీ కోహ్లీకి నో చెప్పాడు. అప్పటికే చాలా ముందుకు వచ్చిన కోహ్లీ మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.  

Advertisement

Also Read :  Virat Kohli : 1205 రోజుల తర్వాత విరాట్ టెస్ట్ సెంచరీ

భరత్ పిచ్ మధ్యలోకి వచ్చిన తరువాత నో చెప్పడంతో విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది. క్రీజ్ లోకి వెళ్లిన వెంటనే భరత్ వైపు సీరియస్ గా చూశాడు. భరత్ కూడా స్పందించి తలవంచి క్షమాపణలు చెప్పాడు. కోహ్లీ ఇలా ఔట్ అయి ఉంటే బహుశా సెంచరీ కూడా పూర్తయ్యేది కాదు. భరత్ చేసిన తప్పిదం వల్ల విరాట్ కోహ్లీ కల చెదిరిపోయేది. టెస్ట్ సెంచరీ కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి వచ్చేది. అంతా సవ్యంగా సాగడంతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. కే.ఎస్. భరత్ మాత్రం అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేయగా.. టీమిండియా 571 పరుగులకు ఆలౌట్ అయింది.  సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 35 ఓవర్లకు గాను 72 పరుగులు చేసింది. కేవలం ఒకే వికెట్ కోల్పోయింది. ఈ లెక్కన చూస్తే ఈ మ్యాచ్ ఢ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

Advertisement

Also Read :  IPL 2023 : ముంబై ఇండియన్స్ కు మరో భారీ షాక్…కీలక ప్లేయర్ అవుట్!