Home » కోహ్లీ ఆడుతావా.. లేదా..?

కోహ్లీ ఆడుతావా.. లేదా..?

by Azhar
Ad

టీం ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ విఫలం అవుతుంటే ఎవరు చూడలేకపోతున్నారు. 2019 వరకు భారత జట్టుకు ముఖమైన బ్యాటర్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం.. భారమైన బ్యాటర్ గా తయారయ్యాడు. ప్రస్తుతం తమ భారత జట్టులో ఒక్కో స్థానానికి ఎంత పోటీ ఉంది అనేది అందరికి తెలుసు. అందుకే ప్రతి ఆటగాడు బాగా ఆడాలి.. లేకుంటే తమ స్థానానికి ఎదురు వస్తుంది అని అనుకుంటారు. అలా జట్టులోకి వచ్చిన వారిని.. పోయిన వారిని ఇప్పటికే చాలా మందిని ఫ్యాన్స్ చూసారు. అయితే విరాట్ కోహ్లీ స్థానానికి కూడా భారీగానే పోటీ ఉంది.

Advertisement

కానీ ఇప్పటికి మూడు ఏళ్ళు అవుతుంది విరాట్ కోహ్లీ తన రేంజ్ లో ప్రదర్శన చేసి. ఈ ఐపీఎల్ 2022 కి దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీకి అందరూ మాజీలు విశ్రాంతి తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. దాంతో కోహ్లీ మాల్దీవ్స్ కు వెళ్లి.. తర్వాత వచ్చి టీం ఇండియాతో ఇంగ్లాండ్ కు వెళ్ళాడు. ఇక ఇప్పుడు కోహ్లీ తన సత్తా చూపిస్తాడు అని అనుకున్నారు ఫ్యాన్స్. ఇంగ్లాండ్ లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 33 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసాడు. అందువల్ల నేటి నుండి ప్రారంభమైన మ్యాచ్ లో అతను అదరగొడుతాడు అని అందరూ అనుకున్నారు.

Advertisement

కానీ నేటి మ్యాచ్ లో కూడా కోహ్లీ తన పేలవ ఫామ్ నే కొనసాగించాడు. ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 19 బంతులు ఎదుర్కొన కోహ్లీ 11 పరుగులు చేసి బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు. దాంతో ఇన్ని రోజులు అతడిని సపోర్ట్ చేస్తూ వచ్చిన అభిమానులు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు నువ్వు పూర్తిగా ఫెల్ అయ్యావు. కాబట్టి ఇండియాకు వచ్చి దేశవాళీ టోర్నీలలో ఆడి.. నీ ఫామ్ ను అలాగే బ్యాటింగ్ ను నిరూపించుకో. అనవసరంగా ఇంకా ఇంటర్నేషనల్ లో ఆడి పరువు తీసుకోకు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

తన భర్త కెప్టెన్ తేలిగ్గా కాలేదు అంటున్న సంజనా..!

కోహ్లీ సెంచరీ పై ఇంగ్లాండ్ వివాదాల కామెంటేటర్ షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading