ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా వరుస సిరీస్ లు ఆడుతూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ టీ20, వన్డే సిరీస్ లను ఘనంగా ముగించింది. టీ20 సిరీస్ ను 1-1 తో సమం చేయగా వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ లో పాల్గొననుంది. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మొదటిసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.
Advertisement
అయితే టెస్ట్ సిరీస్ కు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరి ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఏంటి అన్నది మాత్రం సమాచారం రాలేదు. కాగా, టెస్ట్ సిరీస్ నుంచి మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ లు పలు కారణాలతో తప్పుకోగా… తాజాగా ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే తొలిటెస్ట్ కు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అప్పటిలోగా కోహ్లీ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా….. సఫారీ గడ్డపై భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి మాత్రం సౌత్ ఆఫ్రికాను చిత్తుచేసి చరిత్రను సృష్టించాలనే పట్టుదలతో ఉంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా….. కీప్ టౌన్ లో జనవరి 3న ప్రారంభమవుతుంది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.