Telugu News » Blog » కొత్త విల్లా కొన్న విరుష్క..!

కొత్త విల్లా కొన్న విరుష్క..!

by Manohar Reddy Mano
Ads

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే హీరోయిన్ అనుష్క శర్మ ఇప్పుడు మన దేశంలోనే ఎంతో పాపులారిటీ ఉన్న జంట. అయితే ఈ ఇద్దరు సెలబ్రెటీలు కావడమే ఇందుకు కారణం. అయితే వీరిద్దరి సంపాదన కూడా బాగానే ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. అనుష్క ఒక్కపుడు సినిమాలో బాగా నటించిన.. కూతురు పుట్టిన తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.

Ads

కానీ విరాట్ కోహ్లీ సంపాదనలో కూడా చాల మార్పులు అనేవి ఉన్నాయి. గత మూడేళ్ళుగా సెంచరీ చేయలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ సంపాదించడంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది పడటం లేదు. క్రికెట్ పరంగానే కాకుండా మార్కెటింగ్ లో కూడా కోహ్లీ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పటికే కోహ్లీ ఆస్తి అనేది 1000 కోట్లు దాటిపోయి ఉంటుంది అనే అంచనా. అయితే ఈ మధ్యే తాజాగా కోహ్లీ ఓ విల్లా కొన్నట్లు తెలుస్తుంది.

Ads

అయితే ఈ విల్లా ఖరీదు ఏకంగా 19 కోట్లు అని సమాచారం. ముంబై సిటీకి బయట.. 8 ఎకరాల్లో ఈ విల్లా అనేది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే విరాట్ ఇప్పుడు ఆసియా కప్ కోసం యూఏఈ లో ఉండగా.. అనుష్క కూడా ఇంగ్లాండ్ లో ఉంది. దాంతో దీని ఖరీదు పనులు మొత్తం విరాట్ కోహ్లీ తమ్ముడు వికాస్ కోహ్లీనే దగ్గర ఉండి చూసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం విరాట్ విల్లా విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ad

ఇవి కూడా చదవండి :

టాస్ ఓడిపోయిన ఇండియా.. మ్యాచ్ గెలుస్తుందా..?

టాస్ సమయంలో రవిశాస్త్రి ఆగం..!