Home » రాజమౌళి కారణంగా రెండు ప్లాపులను అందుకున్న వినాయక్… అప్పుడది… ఇప్పుడిది..!

రాజమౌళి కారణంగా రెండు ప్లాపులను అందుకున్న వినాయక్… అప్పుడది… ఇప్పుడిది..!

by AJAY
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి… వివి వినాయక్ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరు కూడా దాదాపుగా ఒకే సమయంలో దర్శకులుగా వీరి కెరియర్లను మొదలుపెట్టారు. అలాగే వీరిద్దరు కూడా వీరి కెరియర్ ప్రారంభంలో వరుస విజాయలను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులుగా కెరియర్లను కొనసాగించారు.

Advertisement

ఇది ఇలా ఉంటే రాజమౌళి వరస విజయాలను అందుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారిపోతే… వినాయక్ మాత్రం ఈ మధ్యకాలంలో వరుస అపజాలను ఎదుర్కొంటూ స్టార్ డైరెక్టర్ల రేసులో వెనకబడిపోయాడు. తన తోటి డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి ని ఇప్పటివరకు వినాయక్ రెండు మూవీల విషయంలో ఫాలో అయ్యాడు. అలా రెండు సినిమాల విషయంలో రాజమౌళి ఫాలో అయిన ఈ దర్శకుడు రెండు సార్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు. మరి రాజమౌళిని వినాయక్ ఏ సినిమాల విషయంలో ఫాలో అయ్యాడో తెలుసుకున్నాం.

Advertisement

రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మగధీర అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వినాయక్… అల్లు అర్జున్ హీరోగా తమన్నా హీరోయిన్గా బద్రీనాథ్ అనే మూవీని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.

ఇది ఇలా ఉంటే రాజమౌళి చాలా సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా శ్రేయ హీరోయిన్గా చత్రపతి అనే మూవీని తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా రాజమౌళి దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం చెందిన ఈ సినిమాను వినాయక్… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఇలా రెండుసార్లు రాజమౌళి అయిన వినాయక్ రెండుసార్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లను అందుకున్నాడు.

Visitors Are Also Reading