Telugu News » Blog » ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టైలర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

‘వినరో భాగ్యము విష్ణు కథ’ టైలర్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్

by Bunty
Ads

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణిగారు సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చేశాడు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇక తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా రూపొందింది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి మురళి కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడిగా కశ్మీర పరదేశి అలరించనుంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అరవింద్, బన్నీ వాసు, హరీష్ శంకర్, మారుతి తదితరులు హాజరయ్యారు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ చేతులమీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

Advertisement

హీరోయిన్ తో హీరో లవ్, ఆమె తండ్రితో కామెడీ, విలన్ గ్యాంగ్ తో యాక్షన్ అంశాలు కలగలిసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇది తిరుపతి నేపథ్యంలో నడిచే కథ. ఇంతవరకు వదిలిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎంతవరకు యూత్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

Advertisement

read also : దర్శకుడు వెంటపడినా.. బ్లాక్ బస్టర్ సినిమా ‘బాషా’ కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా!