Home » Vinaro Bhagyamu Vishnu Katha Telugu Review : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రివ్యూ

Vinaro Bhagyamu Vishnu Katha Telugu Review : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రివ్యూ

by Bunty
Ad

Vinaro Bhagyamu Vishnu Katha Telugu Review : “రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణిగారు సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చేశాడు. ఇక తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా రూపొందింది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడిగా కాశ్మీర పరదేశి అలరించనుంది.

Vinaro Bhagyamu Vishnu Katha Telugu Review

Vinaro Bhagyamu Vishnu Katha Telugu Review

Vinaro Bhagyamu Vishnu Katha Telugu Story: కథ మరియు వివరణ:

విష్ణు(కిరణ్ అబ్బవరం) చిన్నప్పుడే అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దీంతో తాత శ్రీనివాసులు (శుభలేఖ సుధాకర్) అతడిని పెంచి పెద్ద చేస్తారు. అలా విష్ణు లైబ్రేరియన్ అవుతాడు. తోలుత తిరుపతిలోని యూనివర్సిటీలో జాబ్ చేసేవాడు. హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. నైబర్ ఫోన్ నంబర్ వల్ల రాజన్ అని ఓ గ్యాంగ్ స్టర్ ని కలుస్తాడు. కొన్ని పరిస్థితుల వల్ల తన కథ అంతా చెప్తాడు. అలా తన లైఫ్ లోకి వచ్చిన దర్శన (కశ్మీర), శర్మ (మురళీ శర్మ) గురించి కూడా చెప్తాడు. వాళ్ళిద్దరి వల్ల అతను లైఫ్ లో ఏమేం జరిగాయో పూస వచ్చినట్టు రాజన్ కి చెప్తాడు. మరి విష్ణు చివరికి ఏం చేశాడు. రాజన్ చివరకు ఏమయ్యాడు అనేది తెలియాలంటే మీరు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.

Advertisement

Advertisement

‘వినరో భాగ్యము విష్ణుకథ’ టైటిల్ కొంచెం పెద్దగా ఉంది. కానీ, కథంతా పెద్దది ఏమీ కాదు. చాలా అంటే చాలా సింపుల్. ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఉన్న మంచి కుర్రాడు తన ప్రేయసి కోసం ఏం చేస్తాడు అనేది పైకి కనిపించే కథ. దీని వెనుక మరొక కథ ఉందనుకోండి. క్లైమాక్స్ వరకు అది తెలియదు. అందువల్ల దాన్ని పక్కన పెట్టి అప్పటివరకు చెప్పిన కథకు వస్తే ఈ కథను రెండు రకాలుగా తీయవచ్చు. ఒకటి, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా! రెండు, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ టైపులో! దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి, హీరో కిరణ్ అబ్బవరం అండ్ కో రెండు దారుల్లో ఏదో ఒక దారిని ఎంచుకోలేదు. విశ్రాంతి వరకు ప్రేమ కథలా తీసుకువెళ్లారు.

ప్లస్ పాయింట్స్:

కిరాణ్ అబ్బవరం, మురళీ శర్మ యాక్టింగ్
నిర్మాణ విలువలు
కొన్ని డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

బోర్ కొట్టించే చాలా సీన్స్
నిదానంగా సాగే స్టోరీ
సినిమా నిడివి
విసిగించే కథ

Vinaro Bhagyamu Vishnu Katha Telugu Review  రేటింగ్: 2/5

READ ALSO : చిరంజీవి అంత పెద్ద తప్పు చేశాడా ? తన అల్లుళ్ళకి అలాంటి కండిషన్స్ పెట్టి టార్చర్‌ పెట్టేశాడా ?

Visitors Are Also Reading