సినిమా తీయడం ఒక ఎత్తు, సినిమాకు టైటిల్ పెట్టడం ఇంకో ఎత్తు. అందుకే దర్శకులు తమ సినిమా పేర్లకోసం క్యాచీగా ట్రెండీగా ఆలోచిస్తుంటారు. తెలుగులో ఎన్నో క్యాచీ టైటిల్స్, ఎక్స్ పరిమెంటల్ టైటిల్స్ వచ్చాయి. ఊరిపేర్లతో కూడా సినిమాలు రిలీజ్ చేశారు. అలా ఊరి పేర్లతో వచ్చిన సినిమాల గురించి వాటి సక్సెస్ గురించి ఇప్పుడు చూద్దాం!
Advertisement
బొంబాయి:
బొంబాయి మత గొడవలను ఇతివృత్తంగా తీసుకొని మణిరత్నం డెరైక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్టోరీ బొంబాయి నేపథ్యంలో తీశారు కాబట్టి టైటిల్ కూడా బొంబాయే!
Advertisement
భీమిలి :
కబడ్డీ ఇతివృత్తంగా నాని హీరోగా చేసిన ఈ సినిమా కూడా హిట్! ఈసినిమాలో నాని భీమిలి కబడ్డి జట్టులో సభ్యుడు కాబట్టి సినిమాకు అదే పేరును పెట్టారు.
కెరాఫ్ కంచర పాలెం :
కంచరపాలెం ఊర్లోని జనాల మధ్య జరిగిన సంఘటనలనే సినిమా రూపొందించాడు వెంకట్ మహా! ఊరిపేరునే టైటిల్ గా పెట్టి హిట్ కొట్టాడు.
గంగోత్రి :
అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి. పవిత్ర పుణ్యక్షేత్రమైన గంగోత్రి బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా నడిచింది కాబట్టి ఈ సినిమాకు గంగోత్రి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
హనుమాన్ జంక్షన్ :
ఏలూరి దగ్గర హనుమాన్ జంక్షన్ చాలా ఫేమస్….ఇదే పేరుతో జగపతి బాబు, అర్జున్, వేణులు హీరోలుగా వచ్చిన సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
అరుణాచలం , భద్రాచలం, అన్నవరం సినిమాలు కూడా ఊరి పేర్ల మీదే ఉన్నప్పటికీ… హీరోల పేర్లు కూడా అవే అవ్వడంతో ఇక్కడ చర్చించలేదు. మీకు తెల్సిన మరిన్ని సినిమాలు గురించి చెప్పండి.