విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. విక్రమార్కుడు 2006లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్య పాత్రల్లో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీలో రవితేజ కూతురుగా కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
read also : ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన సచిన్ కొడుకు.. అరుదైన రికార్డు కొట్టేశాడు!
Advertisement
ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరించింది చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఎప్పుడు తన తల్లి పాడిన జోల పాటను వినుకుంటూ ఉంటుంది. ఈ సీన్ లో చిన్నారి నటించిన తీరు ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించింది. సినిమాకు ఎమోషనల్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఇక సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు నేహా తోట. ఈ చిన్నారి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్ష సినిమాలో నటించి అందర్నీ భయపెట్టింది.
Advertisement
read also : Sanghavi : ఆ డైరెక్టర్ తో హీరోయిన్ సంఘవి ఎఫైర్ …?
ఆ తర్వాత రాముడు, అనసూయ లాంటి సినిమాలలో కూడా నటించి అలరించింది. ఇక ఆ తర్వాత నేహా సినిమాలకు దూరంగా ఉంది. ఆఫర్లు వచ్చినా కూడా స్టడీస్ కోసం సినిమాలను పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ఎంబీఏ పూర్తి చేసిన నేహా గుర్తుపట్టరానంతగా మారిపోయింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహాను సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు. చూడ్డానికి హీరోయిన్ లా ఉన్నారంటూ చెప్పగా, చదువు పూర్తయ్యాక సినిమా ఆఫర్ వస్తే చేస్తానంటూ రిప్లై ఇచ్చింది.
Read Also : IPL 2023 : అవేష్ ఖాన్ ను బాగా ఆడుకున్న హైదరాబాద్ పోలీసులు