దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పటివరకు జక్కన్న రూపొందించిన అన్ని చిత్రాలు కూడా బ్లాక్ బాస్టర్ కావడం విశేషం. సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డును క్రియేట్ చేశాయి. రాజమౌళి టేకింగ్ పై హాలీవుడ్ దర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలకు స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో స్క్రిప్ట్ కూడా అంతే ముఖ్యం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు స్టోరీ అందిస్తున్నారు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. ప్రధానంగా ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి హిట్ సినిమాలకు కథ అందించారు విజయేంద్రప్రసాద్.
Advertisement
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రానికి విజయేంద్రప్రసాద్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం అడవుల నేపథ్యంలో ఉండనుందని గతంలోనే విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. తాజాగా సినిమా కోసం రాజమౌళి మహేష్ బాబుని ఎంచుకోవడానికి గల కారణాన్ని రివిల్ చేశారు విజయేంద్రప్రసాద్. తాజాగా రాజమౌళి సినిమాలో మహేష్ నుంచి ఎలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని అభిమానులు అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
Advertisement
Also Read : తిరిగి పంపిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈవీవీ…జంబలకడిపంబకు తెరవెనక ఇంత కథ జరిగిందా..?
మహేష్ బాబు చాలా ఇంటెన్స్ యాక్టర్ అని, అతను నటించిన సినిమాల్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూస్తే ఎంత ఇంటెన్సీగా ఉంటాడో అంత అగ్రెసివ్ గా నటిస్తాడు తెలుస్తుంది. అది రచయిత కైనా అడ్వాంటేజ్ ఎలిమెంట్. మహేష్ ఏ పాత్రలోకి అయినా సులభంగా షిఫ్ట్ కాగలడు అని.. దీంతో ప్రతి రచయిత పని సులభం అవుతుందన్నారు. తరువాత దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. “చాలాకాలంగా నా కొడుకు అడవిలో సాహసం వంటి సినిమా చేయాలనుకున్నాడు. కానీ అతనికి అవకాశం రాలేదు. ఇప్పుడు ఇలాంటి స్టోరీకి మహేష్ బాబు ఎంపిక అని అతను భావించాడు. అతని పాత్రకు తగినట్టుగా కథ రాయడం ప్రారంభించాం” అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. అదేవిధంగా ఈ సినిమా వచ్చే ఏడాది మే లేదా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.
Also Read : వీరసింహారెడ్డితో బాలయ్యకి మరో విజయం వరించేనా ?