Home » పుష్ప-3లో హీరోగా విజయ్ దేవరకొండ…!

పుష్ప-3లో హీరోగా విజయ్ దేవరకొండ…!

by AJAY
Published: Last Updated on
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పుష్ప పార్ట్ -2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక పుష్ప పార్ట్ 1 ను సుకుమార్ ది రైస్ అనే క్యాప్షన్ ఇవ్వగా పుష్ప పార్ట్ 2 కు పుష్ప ది రూల్ అని క్యాప్షన్ ఇచ్చారు.

Advertisement

vijay dewarakonda

vijay dewarakonda

అయితే విజయ్ దేవరకొండ కూడా సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా విజయ్ దేవరకొండ సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయనతో దిగిన ఓ ఫోటో ను షేర్ చేశారు. ఈ ఫోటోకు ది రైస్, ది రూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తన సినిమాను విజయ్ దేవరకొండ తానే ది ర్యాంపేజ్ అంటూ పేర్కొన్నాడు. కాగా ఇప్పుడు సుకుమార్ విజయ్ దేవరకొండ తో పుష్ప పార్ట్ 3 తీస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో వరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Visitors Are Also Reading