Home » బాల‌య్య టాక్ షోకు లైగ‌ర్ టీం..ఫ్యాన్స్ కు పండ‌గే..!

బాల‌య్య టాక్ షోకు లైగ‌ర్ టీం..ఫ్యాన్స్ కు పండ‌గే..!

by AJAY
Ad

ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో టాక్ ఫోలు వ‌చ్చాయి కానీ బాల‌య్య అన్ స్టాప‌బుల్ టాక్ షోతో నెవ్వ‌ర్ బిఫోర్ ఎంట‌ర్టైన్మెంట్ ఇస్తున్నారు. స్టార్ హీరోల‌లో ఒక‌రు అయిన బాల‌య్య టాక్ షో చేసేందుకు ముందుకు రావ‌డ‌మే గొప్ప అనుకుంటే ఆయ‌న ఏ స్టార్ తో అయినా క‌ల‌సిపోయి చేసే సంద‌డి మరింత ఆస‌క్తిక‌రంగా ఉంటోంది. ముఖ్యంగా ఎక్క‌డా దాగుడుమూత‌లు లేకుండా బాల‌య్య సూటిగా సుత్తి లేకుండా ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.

vijay dewarakonda balayya

vijay dewarakonda balayya

ఇక ఇప్ప‌టికే ఈ షోకు ప‌లువురు సెల‌బ్రెటీలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇక మోహ‌న్ బాబు ఈ షోకు మొద‌టిసారి గెస్ట్ గా వ‌చ్చారు. ఆ త‌ర‌వాత నాని, ర‌వితేజ, రానా ఇలా ప‌లువురు హీరోలు వ‌చ్చారు. ఇక ఈ షోలో చివ‌రి ఎపిసోడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో ఉండ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ షోలో నెక్స్ట్ వ‌చ్చే గెస్ట్ ఎవ‌రో కూడా తెలిసి పోయింది. నేడు జ‌న‌వ‌రి 4వ తేదీన ఆహా విజ‌య్ దేవ‌ర కొండ మ‌రియు పూరి జ‌గ‌న్నాత్ ల‌ను బాల‌య్య అన్ స్టాప‌బుల్ కోసం ఇంట‌ర్య్వూ చేశారు.

Advertisement

Advertisement

also read : ప్ర‌భాస్ ముందు.. ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్న థ‌మ‌న్..!

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌రకొండ లైగ‌ర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు పూరి జ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా ప్రమోష‌న్ల నేప‌థ్యంనే చిత్ర విజ‌య్ దేవ‌ర‌కొండ పూరీ బాల‌య్య టాక్ షోకు వ‌చ్చిన‌ట్టు కనిపిస్తోంది. మ‌రి బాల‌య్య రౌడీ ఎలా సంద‌డి చేస్తారో చూడాలి.

Visitors Are Also Reading