Home » సినిమా టికెట్లు ఇవ్వాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యాల‌ను కోరిన విజ‌య‌వాడ మేయ‌ర్‌..!

సినిమా టికెట్లు ఇవ్వాల‌ని థియేట‌ర్ యాజ‌మాన్యాల‌ను కోరిన విజ‌య‌వాడ మేయ‌ర్‌..!

by Anji
Published: Last Updated on
Ad

కొంద‌రూ అవ‌స‌రాన్ని బ‌ట్టి త‌మ స్థాయిలో పైర‌వీలు చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక రాజ‌కీయ నాయ‌కులు అయితే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం పైర‌వీలు చేయ‌డం మ‌నం చూశాం. వ్యాపార‌వేత్త‌లు కాంట్రాక్టుల కోసం పైర‌వీలు చేయడం చూశాం. ఇలా ర‌క‌ర‌కాలు పైర‌వీల గురించి మ‌నం రోజూ వింటూనే ఉంటాం. కానీ ప్ర‌భుత్వంలో కీల‌క పొజిష‌న్‌లో ఉండి.. సినిమా టికెట్ల కోసం థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు లేఖ రాసి అడ‌గడం ఎప్పుడైనా చూసారా..?

Advertisement

అవును ఇది నిజ‌మే అండి. ఇప్పుడే తెలుసుకోండి. ముఖ్యంగా కొత్త సినిమా విడుద‌ల అయితే ప్ర‌తి షోకు త‌మ‌కు 100 టికెట్లు కావాలంటూ థియేట‌ర్ యాజ‌మాన్యాల‌ను విజ‌య‌వాడ మేయ‌ర్ కోరారు. కోర‌డం అంటే.. మాట వ‌ర‌స‌కు కాదు. అధికారికంగా లేఖ రాశారు. ఈ లేఖను విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న‌టువంటి సినిమా హాళ్ల యాజ‌మాన్యాల‌కు పంపించారు. ఆ లేఖ‌లో ఏముందో ఇప్పుడు చూద్దాం.

Advertisement


విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌తి నెల కొత్త చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ సినిమాల కోసం టికెట్లు స‌మ‌కూర్చాలంటూ పార్టీ ప్ర‌తినిధులు, కార్పొరేట‌ర్ల నుంచి విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల చెల్లించ‌డం జ‌రుగుతుంది. త‌దుప‌రి విడుద‌ల కానున్న సినిమాల నుంచి వీటిని ఏర్పాటు చేయండ‌ని విజ‌య‌వాడ మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మీ సినిమా థియేట‌ర్ యాజ‌మాన్యానికి లేఖ రాసారు. ఈ లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది.

Visitors Are Also Reading