Home » స‌రిలేరు సినిమాకు విజ‌య‌శాంతి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే…?

స‌రిలేరు సినిమాకు విజ‌య‌శాంతి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే…?

by Azhar
Ad

విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన విష‌యం తెలిసిందే. రాములమ్మ గత పదిహేడేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ గ్యాప్‌లో ఆమె కాస్త రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. ఐతే ఆమెకి రాజ‌కీయాలు ఎందుకో పెద్ద‌గా క‌లిసిరాలేదు. టాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్ అంటే ముందుగా గుర్తు వ‌చ్చే పేరు విజయశాంతి. ఆమె మహేష్ బాబుతో క‌లిసి స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో న‌టించారు. ఆ చిత్రం మంచి హిట్ అయింది. దేశం కోసం త‌న బిడ్డ‌ల‌ను త్యాగం చేసే మంచి త‌ల్లి పాత్ర‌లో ఆమె ఆ సినిమాలో క‌నిపిస్తారు. ద‌ర్శ‌కుడు ఆమెని దృష్టిలో పెట్టుకొని రాసిన పాత్ర అది.

Also Read: విల‌న్ గా సెట్ అవుతున్న హీరోయిన్! ఎందుకిలా?

Advertisement

Advertisement

ఇక‌ ఆమె తన కమ్ బ్యాక్ మూవీకి పారితోషికం ఆషామాషీగా తీసుకోలేదండోయ్‌. ఏంటి ఒక‌ప్ప‌టి హీరోయిన్ క‌దా.. పైగా ఇప్పుడు ఆమెకి పెద్ద‌గా సినిమాలు కూడా లేవు అయినా పారితోషికం డిమాండ్ ఏంటి అనుకుంటున్నారా.. నిజమే ఇంతకీ ఆమెకి ఎంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత ఒవ్పుకున్నారో తెలుగా? మహేష్ బాబు తర్వాత అంత స్టార్ డమ్ ఉన్న నటి ఆ చిత్రంలో విజ‌య‌శాంతి అనే చెప్పాలి. మరి ఈ సినిమా హీరోయిన్ కన్నా ఎక్కువే పారితోషికం ఆమెకి స‌మ‌ర్పించుకున్నార‌ట‌. పరిశ్రమ వర్గాల అంచనా మేరకు ఈ చిత్రం కోసం విజయశాంతికి కోటి రూపాయలు ఇచ్చార‌ని స‌మాచారం.

అప్ప‌ట్లో కొన్ని సంవ‌త్స‌రాలు ఆమె టాప్ హీరోయిన్‌గా చెలామ‌ణి అయ్యారు. ప్ర‌తిధ్వ‌ని, క‌ర్త‌వ్యం, ఒసేయ్ రాముల‌మ్మ వంటి సినిమాలు త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ప్ర‌స్తుతం ఆమె ఏదైనా ఛాన్సులు వ‌స్తే త‌ప్ప‌క చేస్తాన‌ని ఆమె అన్నారు. ఇక విజ‌య‌శాంతి న‌టించాలంటే ఆ పాత్రకి ఎంతో ప్రాముఖ్య‌త ఉండాలి. అలాంటి పాత్ర‌లు ద‌ర్శ‌కులు ఆమె గురించి ప్ర‌త్యేకంగా రాయాలి. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆమెకి అంత పారితోషికం ఇచ్చి మ‌రి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పెట్టుకుంటున్నారంటే ఇక ఆమె గురించి ప్ర‌త్యేకించి చెప్పేదేముంది. ఆమెకున్న క్రేజ్ అది మ‌రి.

Also Read: మ‌న హీరోలు వాళ్ళు న‌మ్మే సెంటిమెంట్లు…ఇలా అయితేనే సినిమా హిట్!

Visitors Are Also Reading