Home » వారసుడుకి అన్ని కోట్లా..?

వారసుడుకి అన్ని కోట్లా..?

by Azhar
Ad

తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ దళపతికి తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. తెలుగులో విజయ్ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ చిరవగావిజయ్ నుండి వచ్చిన బీస్ట్ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు విజయ్ తెలుగు డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లితో సినిమా అనేది చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనేది వేగంగా సాగుతుంది. టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దాంతో ఈ సినిమాకు క్రేజ్ అనేది ఎక్కువగా వచ్చింది. అయితే విజయ్ హీరో కావడం.. దిల్ రాజు నిర్మిస్తుండటం.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమా విడుదలకు ముందే భారీ లాభాలు అనేది చూస్తుంది. తాజాగా ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ అలాగే టీవీ రైట్స్ ను చిత్ర యూనిట్ అమ్మింది.

Advertisement

అయితే ఈ వారసుడు సినిమా యొక్క ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ ఏకంగా 60 కోట్లకు కొనుగోలు చేసింది అని సమాచారం. ఇది భారీ మొత్తం అనే చెప్పాలి. ఇక సాటిలైట్ రైట్స్ కూడా భారీ ధర పలికాయి. ఈ సినిమా యొక్క టీవీ రైట్స్ ను సం నెట్వర్క్ ఏకంగా 50 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తుంది. విడుదలకు ముందే ఇంత సంపాదించిన ఈ సినిమా తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

శ్రీలంక విజయంలో ధోని హస్తం..!

లంక విజయానికి కారణం ఆ ఒక్కటే..!

Visitors Are Also Reading