సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం కామన్. కొంతమంది సినిమాలు చేస్తున్న సమయంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మరికొంతమంది సినిమాలకు గుడ్ బై చెప్పిన తరవాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. తెలుగు నాట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంజనం సృష్టించారు. ఇక ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాట సినిమా తారలు ఎక్కువగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు.
Advertisement
కాగా కొంతకాలంగా తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా విజయ్ సేతుపతి సొంతంగా పార్టీని స్థాపించబోతున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి తమిళంతో పాటూ తెలుగు హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. విలక్షణ నటుడుగా ఆయన గుర్తింపు సంపాదించుకున్నాడు.
Advertisement
vijay sethupathi
పాజిటివ్ మరియు నెగిటివ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే తాజాగా పొలిటికల్ ఎంట్రీ పై విజయ్ సేతుపతి స్పందించాడు. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందని విజయ్ సేతుపతి అన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదన్నారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు. విజయ్ సేతుపతి స్టాలిన్ 70వ పుట్టినరోజు సంధర్బంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు. స్టాలిన్ వారసత్వంతో సీఎం కాలేదని కఠోరశ్రమతో అయ్యారని తెలిపారు.
Advertisement