Home » చెల్లెళ్ల పెళ్లి కోసం మూడేళ్ళు దుబాయ్ వెళ్లిన విజయ్ సేతుపతి.. తెర వెనుక నిజాలు ఏంటంటే..?

చెల్లెళ్ల పెళ్లి కోసం మూడేళ్ళు దుబాయ్ వెళ్లిన విజయ్ సేతుపతి.. తెర వెనుక నిజాలు ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నెగ్గడం అంటే సాహసమే అని చెప్పాలి. కానీ విజయ్ సేతుపతి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా తన నటనతో చిన్నచిన్న రోల్స్ చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ నుండి ఒక స్టార్ హీరోగా ఎదిగారు. విజయ్ సేతుపతి ఈ విధంగా రావడానికి అనేక కష్టాలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది. ఆయన అంతటి నటుడిగా మారడానికి తెర వెనుక ఉన్న కష్టాలు ఏంటో తెలుసుకుందాం. విజయ్ సేతుపతి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. చెల్లెల పెళ్లిళ్ల కోసం విజయ్ సేతుపతి దుబాయిలో ఒక కంపెనీలో అకౌంటెంట్ గా పని చేశాడు. అక్కడ మూడు సంవత్సరాలు పని చేశాక విజయ్ కి ఆ పని మీద ఆసక్తి తగ్గింది. తర్వాత ఇండియాకు వచ్చేశాడు. 2003లో ఇండియాకు వచ్చి ఏం చేయాలని ఆలోచించారు. దీంతో స్నేహితులంతా కలిసి ఇంటీరియల్ డెకరేషన్ వ్యాపారం మొదలుపెట్టారు.

Advertisement

 

ఆ తర్వాత విజయ్ మార్కెటింగ్ కంపెనీలో చేరాడు. ఆ సమయంలోనే దర్శకుడు బాలూ మహేంద్రతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంలోనే బాలు మహేంద్ర విజయ్ లో ఎక్కడో నటన భావాలు ఉన్నాయని చెప్పడంతో, తనలో ఎక్కడో మూలన దాగిఉన్న నటనపై విజయ్ కి ఆసక్తి పెరిగింది. ఎప్పటినుంచి చిన్న చిన్న షార్ట్ ఫిలింమ్స్ లో నటించడం ప్రారంభించాడు. దీని తర్వాత విజయ్ కి అవకాశాలు రావడం మొదలయ్యాయి. సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ చిన్న చిన్న పాత్రలు అవడంతో ఆయనకు సరైన గుర్తింపు రావడం లేదు. ఏడు సంవత్సరాలు చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు విజయ్. విజయ్ తన మొదటి ప్రధాన పాత్రను రామస్వామి నాటక చిత్రం టెనమెర్క్ పరువాకర్త్ నాటకంలో నటించారు.

Advertisement

 

 

 

విజయ్ సేతుపతి గొర్రెల కాపరి పాత్ర పోషించారు. ఈ మూవీ మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను దక్కించుకుంది. ఈ తర్వాత సుందర పాండ్యన్ లో నెగెటివ్ రోల్ లో కనిపించారు. ఇక ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం ఏర్పడింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. దీంతో ఆయనకు చాలా గుర్తింపు లభించింది. అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అగ్ర కథానాయకులలో ఒకరిగా పేరు సంపాదించారు.ఆయన నటించిన 96 సినిమాతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా సైరా సినిమాలో కూడా కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ విధంగా సినీ బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ స్టార్ నటుడిగా ఎదిగారు విజయ్ సేతుపతి.

also read:

Visitors Are Also Reading