Home » జవాన్ సినిమా కోసం విజయ్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా…?

జవాన్ సినిమా కోసం విజయ్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా…?

by Azhar
Ad

బాలీవుడ్ లో కొన్ని ఏళ్లుగా హిట్ అనేది లేక సతమతమవుతున్నాడు కింగ్ కాంగ్ షారుక్ ఖాన్. కొత్తగా వచ్చిన ఎవరెవరికో హిట్స్ అనేవి వస్తున్నాయి. కానీ షారుక్ ఖాన్ మాత్రం హిట్ అనే పదం విని చాలా రోజులు అయ్యిపోతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో మన సౌత్ సినిమాలు అనేవి సూపర్ హిట్స్ అందుకుంటున్నాయి. దాంతో సౌత్ డైరెక్టర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ కారణంగా మన సౌత్ డైరెక్టర్ అట్లీతో ఇప్పుడు తన సినిమా అనేది చేస్తున్నాడు షారుక్ ఖాన్. ఈ సినిమాపైనే తన ఆశలు అన్ని ఉంచుకొని.. సినిమాకు ఎక్కువగా మెరుగులు దిద్దడానికి చూస్తున్నాడు.

Advertisement

అందువల్ల ఇప్పుడు షారుక్ ఖాన్ అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న జవాన్ అనే సినిమాలో సౌత్ సూపర్ హీరో విజయ్ దళపతికి ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు. అయితే ఇందులో విజయ్ ఎంత సేపు కనిపిస్తాడు.. ఎటువంటి రోల్స్ లో కనిపిస్తాడు అనే విషయం తెలియడం లేదు. కానీ ఈ సినిమా కోసం విజయ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనేది చర్చగా మారింది. ఎందుకంటే మాములుగా విజయ్ తన సినిమాల కోసం 100 కోట్లు అనేది ఛార్జ్ చేస్తాడు. అందువల్ల ఈ జవాన్ కోసం విజయ్ ఎంత తీసుకుంటున్నాడు అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు జనాలు.

Advertisement

కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే.. ఈ జవాన్ సినిమా కోసం విజయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. ఈ సినిమాను ఫ్రీ గా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విజయ్ కి డైరెక్టర్ అట్లీతో మంచి స్నేహం ఉంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో తమిళ్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే షారుక్ ఖాన్ తో కూడా విజయ దళపతికి మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కారణంగానే ఈ సినిమా కోసం ఎం తీసుకోకుండా.. ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా షారుక్ ఖాన్ కు హిట్ ఇస్తుందా.. ఇందులో విజయ్ రోల్ ఎలా ఉంటుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఇంగ్లాండ్‌తో వ‌న్డే.. ఆ కీలక ఆట‌గాడు అందుకే ఆడ‌లేదా..?

మళ్ళీ రెస్ట్ కోరుతున్న కోహ్లీ.. బీసీసీఐ ఏం చేయనుంది..?

Visitors Are Also Reading