Home » ముంబై లో చెక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కిన హిట్ పెయిర్..!

ముంబై లో చెక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కిన హిట్ పెయిర్..!

by AJAY
Ad

నేషనల్ క్రష్ రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముంబై లో చెక్కర్లు కొడుతూ కెమెరాలకు చిక్కారు. ముంబై లోని బాంద్రా లో ఈ జంట ఓ హోటల్ లో డిన్నర్ చేసి బయటకు వచ్చారు. ముందు విజయ్ వచ్చిన కారులో కూర్చోగా ఆ తరవాత వెనకాలే విజయ్ దేవరకొండ వచ్చి కారులో కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు లవ్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా ఈ జంట చక్కర్లు కొట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి.

Vijay dewarakonda rashmika spotted at mumbai

Vijay dewarakonda rashmika spotted at mumbai

అంతే కాకుండా రౌడీ హీరో బ్యూటీ ని ఇంటికి పిలిచి ట్రీట్ కూడా ఇచ్చాడు. వీరిద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో ఈ జంటకు హిట్ పెయిర్ గా గుర్తింపు వచ్చింది.

Advertisement

Advertisement

 

అయితే ఈ మధ్య కాలం లో ఇద్దరూ తమ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఇద్దరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. రాష్మిక రీసెంట్ గా విడుదలైన పుష్ప సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అప్పట్లో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వచ్చినా ఇద్దరూ పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు మళ్లీ కెమెరాకు చిక్కడం తో గాసిప్పులు షురూ అయ్యాయి.

https://www.instagram.com/reel/CXrJIgQFLL2/?utm_medium=copy_link

Visitors Are Also Reading