Home » సుకుమార్‌కు ‘లైగర్’ స్పెషల్ విషెస్

సుకుమార్‌కు ‘లైగర్’ స్పెషల్ విషెస్

by Anji
Ad

టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇవాళ త‌న 52వ పుట్టిన రోజు వేడుక‌ను జ‌రుపుకున్నారు. సుకుమార్ బ‌ర్త్‌డే విషేస్‌తో ఇవాళ ట్విట్ట‌ర్‌ మారు మ్రోగిపోయింది.అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా సుకుమార్‌కు బ‌ర్త్‌డే విషెష్ తెలిపారు. ఇప్ప‌టికే ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన రామ్ చ‌ర‌ణ్‌, అల్లుఅర్జున్, రామ్ వంటి హీరోలు ఈ లెక్క‌ల‌ మాస్ట‌ర్‌కు త‌మ‌దైన రీతిలో శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌ముందు ప‌ని చేసే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంతే స్పెష‌ల్‌గా సుకుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఒక సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌తో పుష్ప ది రూల్ త‌రువాత సుకుమార్ విజ‌య్‌తో సినిమా ప్రారంభించ‌నున్నారు.

Advertisement

vijay devarakonda

Advertisement

అప్ప‌టిలోగా విజ‌య్ లైగ‌ర్ షూటింగ్‌ను పూర్తి చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని కూడా విజ‌య్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డ ఇంచా. ముఖ్యంగా సుకుమార్ సార్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మీతో సినిమా చేయ‌డానికి ఎదురు చూడ‌లేక‌పోతున్నాను. 2021లో దిరైజ్‌, 2022లో ది రూల్‌, 20223లో ది ర్యాంపేజ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ర్యాంపేజ్ క‌థ‌తో విజ‌య్ ని ఏ రేంజ్‌లో చూపించ‌నున్నాడో అని అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తూ ఉన్నారు.

Visitors Are Also Reading