నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈషో ఎంతటి ప్రజాదరణ పొందుతున్నదో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ల కబుర్లు, బాలయ్య పంచ్‌లతో ప్రతి శుక్రవారం సందడి సందడిగా సాగుతోంది. ఇక ఇప్పటికే 10 ఏపీసోడ్లతో ఈ సీజన్ ముగియనున్నదని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి గెస్ట్‌గా మహేష్‌బాబు రానున్నారు. అయితే తాజాగా మహేష్‌కు కరోనా రావడంతో మహేష్‌బాబు వస్తాడా రాడా అనేది కాస్త అనుమానంగా ఉన్నది. షూటింగ్ ముందే చేసి ఉంటారు కాబట్టి వస్తాడు అని కొందరూ పేర్కొనడం గమనార్హం.
అయితే తొమ్మిదవ ఎపిసోడ్ లైగర్ సందడి చేయనున్నాడు. విజయ్ దేవరకొండ అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌గా రానున్నాడు అనే వార్తలు గుప్పుమన్నవే తప్ప అఫిషియల్ గా మేకర్స్ ప్రకటించింది లేదు. ప్రస్తుతం 8వ ఎపిసోడ్లో బాలయ్యతో రానా సందడి చేయనున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ రేపు శుక్రవారం స్ట్రీమింగ్ కానున్నది. ఇకపోతే దీని తరువాత ఎపిసోడ్లో విజయ్‌దేవరకొండ పాల్గొననున్నాడు. ఈ ఎపిసోడ్ షూటిం గ్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. సెట్లో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఈషోలో బాలయ్య పంచెకట్టుతో కనిపించడంతో సంక్రాంతికి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. రౌడీ హీరోను బాలయ్య ఏవిధమైన ప్రశ్నలు వేసి ఆటపట్టించాడో ప్రో వచ్చే వరకు ఎదురుచూడక తప్పదు.