Home » విజయ్ దేవరకొండ ఇప్పటికే 5 సూపర్ హిట్స్ వదులుకున్నాడు.. అవేంటంటే..?

విజయ్ దేవరకొండ ఇప్పటికే 5 సూపర్ హిట్స్ వదులుకున్నాడు.. అవేంటంటే..?

by Azhar
Ad

మన టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరో ఎవరు అనే రేసులో చాలా మంది హీరోలు పాల్గొంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. 2016లో పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ… ఆ తర్వాత తనదైన స్టైల్ తో త్వరగానే స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం అనేది చాలా మామూలు విషయం. కానీ ఈ కొద్ది కాలంలోనే విజయ్ దేవరకొండ 5 సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం

Advertisement

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా స్టోరీతో మొదట వెంకీ కుడుముల విజయ్ దగ్గరికి వెళ్లాడట. కానీ కథ నచ్చక ఆ సినిమాను వీకే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే కార్తికేయకు మంచి పేరు తీసుకు వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా కూడా మొదట విజయ వద్దకు వెళ్ళింది.. కానీ దానిని విజయ్ తిరస్కరించాడు. ఆతర్వాత టాలీవుడ్లో ఆ సెన్సేషనల్ హిట్ అయింది. ఇక అలాగే పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమా. ఈ సినిమా రామ్ కు మంచి మాస్ ఇమేజ్ ను తీసుకు వచ్చింది. కానీ ఈ సినిమాతో పూరి మొదట విజయ వద్దకు వెళ్ళాడు… కానీ దానిని కూడా దేవరకొండ వదులుకున్నాడు

Advertisement

అలాగే మెగా కుటుంబం నుండి హీరోగా వైష్ణవ తేజ్ పరిచయమైనా ఉప్పెన సినిమా కూడా విజయ్ చేయాల్సిందే. కానీ కుదరలేదు. అలాగే తాజాగా కొరటాల శివ చెప్పిన కథని కూడా విజయ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ అంటే హిట్ డైరెక్టర్ కాబట్టి విజయ్ మరో హిట్ వదులుకున్నాడు అని అర్థమవుతుంది. అలాగే బాలీవుడ్ లో కూడా విజయ్ రెండు సినిమాలను రిజెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమాలో కొన్ని సినిమాలు విజయ్ డేట్స్ కుదరక కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం విజేత రెండు [అం ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అవి ఏం అవుతాయి అనేది చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కు రెస్ట్ ఇవ్వడం అవసరే లేదు.. ఆతను ఏం ఆడాడు..!

ఐపీఎల్ లో ఆడకపోవడమే మంచి పని అంటున్న పుజారా…!

Visitors Are Also Reading