Telugu News » Blog » విజయ్ దేవరకొండది అలాంటి క్యారెక్టర్.. ఆయనతో సినిమాలు చేయనంటున్న సాయిపల్లవి..!!

విజయ్ దేవరకొండది అలాంటి క్యారెక్టర్.. ఆయనతో సినిమాలు చేయనంటున్న సాయిపల్లవి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోలలో రోజు రోజుకు అత్యంత అభిమానుల ఆదరణ పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరస హిట్లతో దూసుకుపోతున్నారు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాను తీసుకువచ్చి మరింత గుర్తింపు సాధించడం కోసం ముందుకు వెళ్తున్నారు.. విజయ్ దేవరకొండ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకొని అమ్మాయిలకైతే కలల రాకుమారుడిగా మారిపోయాడు.. కొంతమంది హీరోయిన్స్ కూడా ఆయనతో నటించాలని పోటీ పడుతున్నారు ఉంటే ఆయనకు క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..

Advertisement

 

అయితే ఓ వైపు హీరోయిన్స్ అంతా ఆయనతో నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటే ఆ హీరోయిన్ మాత్రం అతనితో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తానని వెల్లడించింది.. అసలు అతని సినిమాల్లో నటించను అని తెగేసి చెప్పింది.. ఇప్పటికే ఆయనతో నటించే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించిందట… ఆమె ఎవరు అనుకుంటున్నారు కదూ.. మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో మనందరికీ తెలిసిందే.. ఆమె సినిమా కథ నచ్చితేనే అందులో నటిస్తుంది తప్ప ఎన్ని డబ్బులు ఇచ్చినా తనకు నచ్చని పాత్రల్లో నటించడానికి ఒప్పుకోదు.. అయితే ఆమెకు దర్శకులు కూడా ప్రత్యేకమైన పాత్రలు ఉన్న సినిమాలోని తీసుకుంటుంటారు..

Advertisement

అయితే ఆమెకు ఇప్పటికే విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక చేసిన పాత్ర కు ముందుగా సాయి పల్లవినీ అడిగారట. కానీ సాయిపల్లవి అందులో ముద్దుసీన్లు ఉండడం వల్ల రిజెక్ట్ చేసిందట.. అంతే కాకుండా భవిష్యత్తులో కూడా అతనితో సినిమా చేయాలని వెల్లడించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే విజయ్ సినిమాలు ఎంపిక చాలా భిన్నంగా ఉంటుందని.. కాబట్టి భవిష్యత్తులో కూడా అతనితో సినిమాలు చేయడానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పేసింది. ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తాడో తెలియాల్సి ఉన్నది..

Advertisement

ALSO READ;

You may also like