Home » అస‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యాగ్రౌండ్ ఏంటి…ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడో తెలుసా..!

అస‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యాగ్రౌండ్ ఏంటి…ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడో తెలుసా..!

by AJAY
Ad

సైడ్ యాక్ట‌ర్ హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ లు చేసి ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చేసింది త‌క్కువ సినిమాలే అయినా అతి త‌క్కువ కాలంలో విజ‌య్ స్టార్ డ‌మ్ ను సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా ఎదిగి ప్ర‌స్తుతం ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సినిమా బ్యాగ్రౌండ్ ముందు నుండే ఉంది.

vijay dewarakonda

vijay dewarakonda

విజ‌య్ దేవ‌రకొండ తండ్రి మాద‌వ‌రావు సినిమాల పై ఉన్న ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ నటుడు అవుదామ‌నుకుంటే ద‌ర్శ‌కుడిగా స్థిర‌ప‌డ్డాడు. దూర‌ద‌ర్శన్ తో పాటూ ఇత‌ర టీవీ ఛాన‌ల్ల‌లో ప‌లు సూప‌ర్ హిట్ సీర‌య‌ల్స్ ను తెర‌కెక్కించాడు. విజయ్ త‌ల్లి మెటివేష‌న‌ల్ స్పీక‌ర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ చ‌దువు త‌ర‌వాత అమెరికా వెళ్లి ఉద్యోగం చేశాడు.

Advertisement

Advertisement

Vijay Devarakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఎదిగిన త‌ర‌వాత తిరిగి ఇండియాకి వ‌చ్చి ఆనంద్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆనంద్ దేవ‌ర‌కొండ మొద‌ట‌గా ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నువ్విలా సినిమాలో న‌టించాడు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోనూ న‌టించాడు. ఆ త‌ర‌వాత నాని హీరోగా న‌టించిన ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాలో న‌టించాడు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే నిర్మాత‌లు విజ‌య్ న‌ట‌న చూసి రెండు సినిమాల‌కు సైన్ చేసుకున్నారు.

ఆ త‌ర‌వాత త‌రుణ్ భాస్కర్ సినిమా పెళ్లి చూపులుతో విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి విజ‌యం అందుకున్నాడు. ఆ త‌ర‌వాత అర్జున్ రెడ్డి తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ వెంట‌నే గీతాగోవిందంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను సైతం మెప్పించాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగాడు. మరి ముందు ముందు ఈ రౌడీ హీరో కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading